చైనా కంపెనీ రియల్‌మీ భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో బలమైన పోటీనిస్తోంది. బెస్ట్ ఫీచర్లతో సరసమైన ధరలోనే స్మార్ట్‌ఫోన్లను అందిస్తుండటంతో మొబైల్ ప్రియులు ఈ బ్రాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఎన్నో స్మార్ట్ ఫోన్లు ఇప్పటి వరకు లాంఛ్ అయ్యాయి. ఏ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత దానిదే. మరి, రియల్‌మీ విడుదల చేసిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లేంటో ఓసారి చూసేద్దామా.
Realme 11 Pro+ 5G
5000mAh బ్యాటరీ కెపాసిటీతో 100వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8GB RAM+ 256GB, 12GB RAM+ 256GBలను కొనుగోలు చేయొచ్చు. 200MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ దీని సొంతం. 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. లోయర్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24,599.
Realme X50 Pro 5G
ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8GB RAM+ 128GB స్టోరేజ్, 12GB RAM, 256GB స్టోరేజ్‌లతో ఫోన్ అందుబాటులో ఉంది. 4200mAh బ్యాటరీ కెపాసిటీతో 65 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. 64MP క్వాడ్ రియర్ కెమెరాతో పాటు డ్యుయల్(32MP+8MP) ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. లో ఎండ్ వేరియంట్ ధర రూ.29,999.
Realme 9 Pro+ 5G
రియల్‌మీ నుంచి వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్లలో ఇది టాప్ ప్లేసులో ఉంటుందని చెప్పుకోవచ్చు. గతేడాది విడుదలైన ఈ ఫోన్ బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 6.46 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 పవర్‌ఫుల్ ప్రాసెసర్ దీని సొంతం. 50MP+ 8MP+ 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4500mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. 6GB/8GB RAM, 128GB/256GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.24,990.
Realme GT 2 Pro
రియల్‌మీ జీటీ 2 ప్రో మోడల్ మొబైల్ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంది. ట్రిపుల్ రియర్ కెమెరా(50MP+50MP+2MP) సెటప్‌తో పాటు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1, ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంది. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పాటు 8GM RAM, 128GB స్టోరేజ్‌లలో లభిస్తోంది. దీని ధర రూ.39,999.
Realme X3 SuperZoom
రియల్‌మీ ఎక్స్3 సూపర్ జూమ్ పాజిటివ్ రివ్యూలను అందుకుంది. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తోంది. 6.6 అంగుళాల భారీ డిస్‌ప్లేని కలిగి ఉంది. క్వాడ్(4) రియర్ కెమెరా సెటప్(64MP+8MP+8MP+2MP)తో పాటు డబుల్ సెల్ఫీ కెమెరా(32MP+8MP)తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ 4200mAhగా ఉంది. దీని ధర రూ.23,990.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!