మరికొన్ని గంటల్లో ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచం ముందుకు రానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన వివిధ రకాల మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు యాపిల్ సంస్థ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన ఈవెంట్ కాలిఫోర్నియాలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. అయితే, ఈవెంట్‌కు ముందు ఇండియాలో ఐఫోన్ 15 ధరకు సంబంధించిన ఓ వార్త బయటకి వచ్చింది. దానితో పాటు ఈ యాపిల్ ఈవెంట్-2023కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ 15 ధర డాలర్లలో..
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్.. మెుత్తం నాలుగు మోడళ్లలో మార్కెట్లో రిలీజ్ కానుంది. ఐఫోన్ 15 (iphone 15), ఐఫోన్15 ప్లస్ (iphone 15 Plus), ఐఫోన్ 15 ప్రో (iphone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iphone 15 Pro Max) వంటి మోడల్స్ ప్రపంచం ముందుకు రానున్నాయి. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు, ఐఫోన్ 15 ప్లస్ ధర 899 డాలర్లుగా ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మిగిలిన రెండు మోడల్స్ ధరలు వీటి కన్నా ఎక్కువగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
మన కరెన్సీలో ఎంతంటే?
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమే నిజమైతే భారత్‌లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గా ఉండనుంది. ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉండొచ్చని టెక్ వర్గాల అంచనా వేస్తున్నాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 (iphone 14)సిరీస్ ప్రారంభ ధర కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉండటం గమనార్హం. ఇవాళ రాత్రి జరగనున్న యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 15 మోడల్స్, వాటి ధర, ఫీచర్లపై ఓ క్లారిటీ రానుంది.
యాపిల్ ఈవెంట్ ఎలా చూడాలి?
యాపిల్ సంస్థ ‘వండర్లస్ట్ ఈవెంట్’ (Wanderlust event) పేరుతో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. తమ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్లో ఈ ఈవెంట్‌ను లైవ్‌స్ట్రీమింగ్‌లో చూడవచ్చని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది.
లాంచ్ అయ్యే ప్రొడక్ట్స్?
ఇవాళ జరిగే ‘వండర్లస్ట్ ఈవెంట్’లో పలు యాపిల్ ప్రొడక్ట్స్ రిలీజ్ కానున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9), యాపిల్ వాచ్ అల్ట్రా 2 (Apple Watch Ultra 2) లాంచ్ కానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఐఫోన్ 15 అల్ట్రా (iPhone 15 Ultra) మెుబైల్‌పై కూడా అధికారిక ప్రకటన ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మరికొద్ది గంటల్లోనే క్లారిటీ రానుంది.
బహిరంగ ఈవెంట్
కొవిడ్ కారణంగా గత కొన్నేళ్లుగా ఈ యాపిల్ ఈవెంట్ ఆన్లైన్ వేదికగా జరిగింది. కానీ ఈసారి లాంచింగ్ ఈవెంట్‌ను బహిరంగంగా నిర్వహించాలని యాపిల్ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌ను ఎంచుకుంది.
ఆ మోడల్ లాంచ్ అనుమానమే!
అయితే ఐఫోన్ 15 సిరీస్‌లోని ప్రో మ్యాక్స్ మోడల్‌పై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మెుబైల్ లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. సప్లై చెయిన్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణమని సమాచారం. ఇందులో వాస్తవమెంతో మరికొద్దిసేపట్లో స్పష్టత రానుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!