చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి సన్‌స్క్రీన్ రక్షిస్తుంది. కాలంతో, రోజుతో సంబంధం లేకుండా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సన్‌స్క్రీన్ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంది. లోషన్ లేదా క్రీమ్, స్టిక్స్ రూపంలో సన్‌స్క్రీన్ లభిస్తోంది. ఈజీ అప్లైతో పాటు, ప్రభావవంతమైన ఫలితాలు పొందేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ స్టిక్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సన్‌స్క్రీన్ స్టిక్స్ చర్మాన్ని ఎలా రక్షిస్తాయి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మార్కెట్లోని టాప్-5 స్టిక్స్ ఏవి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.
సౌకర్యం
ఇతర సన్‌స్క్రీన్ లోషన్స్‌తో పోలిస్తే సన్‌స్క్రీన్ స్టిక్స్ సైజ్‌లో చాలా చిన్నగా, బరువు తక్కువగా ఉంటాయి. లీకేజీ సమస్య ఉండదు. ప్రయాణాల్లో వాడటానికి, క్యారీ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. జేబు, బ్యాగు, పర్స్‌లలో ఇవి సులువుగా అమరిపోతాయి.
రాయడం తేలిక
ఇవి స్టిక్ రూపంలో ఉండటం వల్ల అనుకున్న చోట ఖచ్చితంగా రాసుకోవచ్చు. ముక్కు, చెవులు, పెదాల చుట్టూ సులభంగా అప్లై చేయవచ్చు. చేయి వాడకుండా నేరుగా రాసుకోవచ్చు. ఎలాంటి గందరగోళం ఉండదు.
జిడ్డు ఉండదు
సన్‌స్క్రీన్ రాసుకున్నాక చర్మం అస్సలే జిడ్డుగా అనిపించదు. ఎలాంటి స్కిన్ కలిగిన వారైనా వీటిని నిరభ్యంతరంగా వాడవచ్చు. చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇతర సమస్యలొస్తాయనే భయం కూడా అక్కర్లేదు.
వాటర్ రెసిస్టెన్స్
దాదాపుగా అన్ని సన్‌స్క్రీన్ స్టిక్స్ నీటిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా నీళ్లలో తడిసినా స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ ఆడినా ఎలాంటి సమస్య ఉండదు. అధిక చెమటతో బాధపడేవారు కూడా సన్‌స్క్రీన్ స్టిక్స్‌ను ధైర్యంగా వాడవచ్చు.
మార్కెట్లోని టాప్-5 సన్‌స్క్రీన్ స్టిక్స్
The Derma Co Hyaluronic
మార్కెట్లో లభిస్తోన్న బెస్ట్ సన్‌స్క్రీన్ స్టిక్స్‌లో ‘The Derma Co Hyaluronic’ ఒకటి. ఇది 60 Sun Protection Factorను కలిగి ఉంది. 20 గ్రాముల బరువు, వాటర్ రెసిస్టెన్స్ సామర్థ్యంతో దీన్ని తయారు చేశారు. దీని అసలు ధర రూ.999 కాగా, అమెజాన్‌లో 10% డిస్కౌంట్‌తో రూ.899కే ఇది లభిస్తోంది.
Dot & Key Strawberry Dew
మార్కెట్లోని బెస్ట్ సన్‌స్క్రీన్ స్టిక్స్‌లో Dot & Key Strawberry Dew ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది స్ట్రాబెర్రి ప్లేవర్‌తో తయారైంది. ప్రమాదకరమైన UVA+UVB కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. SPF 50ను కలిగి ఉంది. ఎలాంటి స్కిన్ కలిగిన వారైన దీన్ని వినియోగించవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.535కు అందుబాటులో ఉంది.
Earth Rhythm Glow
దీనికి కూడా యూజర్ల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. విటమిన్ సీ, ఈ, జింక్ ఆక్సైడ్, వాటర్ రెసిస్టెన్స్, SPF 50 గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు హానికారకమైన UV కిరణాల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 474గా ఉంది.
Sotrue SPF 50+ Daily Sunscreen
ఇందులోని జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ మీ చర్మానికి రక్షణగా నిలబడతాయి. 50 Sun Protection Factor (SPF), నీటిని తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. ఆయిల్, డ్రై స్కిన్ సహా ఎలాంటి చర్మాన్ని కలిగిన వారైన Sotrue SPF 50+ Daily Sunscreen ఉపయోగించవచ్చు. దీని ధర అమెజాన్‌లో రూ.497.
Minimalist SPF 50 Sunscreen Stick
మినిమలిస్ట్ (Minimalist) కంపెనీ ఉత్పత్తి చేసే సన్‌స్క్రీన్ స్టిక్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా Minimalist SPF 50 Sunscreen Stickపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది UVA / UVB కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అమెజాన్‌లో దీని ధర రూ.799 గా ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!