దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘శాంసంగ్’ (Samsung) మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్ ప్రియులకు ఎంతగానో ఇష్టమైన గెలాక్సీ (Galaxy) సిరీస్ నుంచి దాన్ని తీసుకొచ్చింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ’ (Samsung Galaxy S23 FE) పేరుతో ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. ఈ ఫోన్ ఒకే వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. ఈ గెలాక్సీ ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చినట్లు లాంచింగ్ ఈవెంట్లో శాంసంగ్ ప్రకటించింది. టెక్ ప్రియులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ డిస్ప్లే
‘శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మెుబైల్.. 6.4 అంగుళాల అమోలెడ్ ప్యానల్‌తో పంచ్ హోల్ డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి Full HD+ స్క్రీన్ రిజల్యూషన్, HDR10+ క్వాలిటీని అందించారు. ఇది Snapdragon 8 Gen 1 chipsetను కలిగి ఉంది. Android 13 OSతో ఈ ఫోన్ వర్క్ చేయనుంది.
స్టోరేజ్ సామర్థ్యం
Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. 8GB RAM/128GB ROM, 8GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్లను కలిగి ఉంది. మీ అవసరాన్ని బట్టి ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాన్ని ఎంచుకోవచ్చు.
బ్యాటరీ
ఈ ఫోన్‌కు 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫిక్స్ చేశారు. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అయితే Galaxy S23 స్మార్ట్‌ఫోన్‌తో (45W) పోలిస్తే ఈ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తక్కువేనని చెప్పాలి.
కెమెరా క్వాలిటీ
గెలాక్సీ ఎస్23 తరహాలోనే Galaxy S23 FE కూడా వెనక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 MP + 8 MP + 12 MP కెమెరాలు ఉన్నాయి. ఇక ఫ్రంట్ సైడ్ 10MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. వీటి సాయంతో అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మెుబైల్.. బ్లూటూత్ 5.3, వైఫై 6ఈ, ఎన్ఎఫ్ఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు నాలుగేళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది. అలాగే ఐదేళ్లు సెక్యురిటీ ప్యాచెస్ ఇస్తామని హామీ ఇచ్చింది.
కలర్స్
ఈ నయా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ మెుత్తం నాలుగు కలర్స్‌ను కలిగి ఉంది. క్రీమ్, పర్పుల్, గ్రాఫైట్, మింట్ రంగుల్లో ఇది లభిస్తుంది.
ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ అక్టోబర్ 26 నుంచి విక్రయానికి రానుంది. భారత్‌లో దీని ధర ఎంతో ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర 599 డాలర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీన్ని బట్టి భారత్‌లో ఈ ఫోన్ వెల దాదాపు రూ.49,800గా ఉండనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!