నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవిశంకర్, వైవా హర్ష, వడివక్కరసి తదితరులు
దర్శకుడు: వీఐ ఆనంద్
కథ : భాను భోగవరపు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : అనిల్ సుంకర, బాలాజీ గుత్తా
విడుదల తేదీ: 16-02-2024
సందీప్‌కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ రూపొందించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరో సందీప్ కిషన్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
బసవ (సందీప్ కిషన్) (Ooru Peru Bhairavakona Review) ఓ స్టంట్ మ్యాన్. అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం తన గ్యాంగ్ జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భైరవకోన అనే ఊరిలోకి వెళ్తాడు. అయితే ఈ ఊరికి ఎవరైనా వెళ్లడం తప్ప.. అక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన ఉండరు. మరి భైరవకోన వెళ్లిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? భైరవకోన చరిత్ర ఏమిటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు ఆ ఊరికి సంబంధం ఏమిటి? బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
బసవ పాత్రకు సందీప్ కిషన్ (Ooru Peru Bhairavakona Review) న్యాయం చేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. ప్రతి సన్నివేశంలో జీవిస్తూ భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించాడు. భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ పర్వాలేదు. ఆమెకు రాసిన సీన్లలో బలం లేకపోవడంతో ఆమె ప్రభావం సినిమాలో తక్కువే. ఇక కావ్య థాపర్ ఉన్నంతలో అందంగా కనిపించింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష కాంబోలో సీన్లు, వాళ్లిద్దరి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ సైతం నవ్వించారు. రవి శంకర్, వడివక్కరసి, జయప్రకాశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భాను భోగవరపు రాసిన కథ, ఆ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ఊరుని చూపించి భైరవకోనపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు దర్శకుడు. కథలో బలం ఉన్నప్పటికీ కథనంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. భైరవకోనలో పాత్రలను పరిచయం చేసేటప్పుడు కలిగే ఆసక్తి కథలోకి వెళ్లాక ఉండదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్లిద్దరి బంధం కూడా సాదా సీదాగానే చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రగలించినా.. విశ్రాంతి తర్వాత దానిని మెయిన్‌టెన్ చేయడంలో విఫలమయ్యారు. వెన్నెల కిశోర్, వైవా హర్ష, బ్రహ్మాజీ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి.
టెక్నికల్‌గా
టెక్నికల్ బృందం (Ooru Peru Bhairavakona ) నుంచి దర్శకుడు వీఐ ఆనంద్ మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర పాటలు సినిమా విడుదలకు ముందు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథలో కొత్తదనం
- సందీప్ నటన
- ట్విస్ట్‌లు
మైనస్ పాయింట్స్
- ఆసక్తి లేని సన్నివేశాలు
- సెకండాఫ్
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!