• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo Z9 : మీడియం బడ్జెట్‌ రేంజ్‌లో అద్భుతమైన కెమెరా ఫొన్… ధర, ఫీచర్లు మీకోసం!

    iQoo బ్రాండ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది.  iQoo Z9 5G పేరుతో వచ్చే నెల మార్చి  12న లాంచ్ కానుంది.  Vivo కంపెనీ సబ్-బ్రాండ్ అయిన ఐకూ.. ఐకూ Z9 గురించి అనేక వివరాలు వెల్లడించింది. కర్వ్డ్ డిస్‌ప్లే, హోల్‌ పంచ్ కటౌట్‌తో ఆకర్షిస్తున్న ఈ ఫొన్ స్మార్ట్ ఫీచర్లు, ధర ఎలా ఉండబోతుందో ఈ కథనంలో చూద్దాం.

     iQoo Z9 5G డిస్‌ప్లే (iQoo Z9 Specifications)

    ఐకూ iQoo Z9 గతంలో వచ్చిన ఫోన్ల కంటే అడ్వాన్స్డ్‌ స్మార్ట్‌ ఫీచర్లతో మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫొన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేతో రానుంది. హ్యాండ్‌సెట్ యాంటీగ్లేర్ గ్లాస్‌ ఫినిషింగ్‌తో మరింత ఆకర్షనీయంగా కనిపించనుంది.  6.64 అంగుళాల పొడవుతో ఫుల్ హెచ్‌డీ ఫ్లస్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది ip54 రెటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంది. 

    కెమెరా (iQoo Z9 Camera)

    iQoo Z9.. 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలో ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) వంటి ప్రత్యేక ఫీచర్‌ను అమర్చారు. అలాగే ఇది Sony IMX882 sensor కలిగి ఉండటం వల్ల ఫొటోలు మరింత నేచురల్ టోన్‌లో కనిపిస్తాయి. అలాగే 16 మెగాఫిక్సెల్ సామర్థ్యంతో ఫ్రంట్ లేదా సెల్ఫీ కెమెరా రానుంది. అయితే  అయితే అల్ట్రా వైడాంగిల్ లెన్స్ మాత్రం కెమెరాలో లేవు. అయితే కెమెరా ఫర్ఫామెన్స్ పరంగా ఇది బెస్ట్ ఫోన్‌గా చెప్పవచ్చు.

    చిప్‌సెట్

    iQoo Z9 హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 7200 5G SoC చిప్‌సెట్‌ను కలిగి ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది.  రీసెంట్‌గా రిలీజ్ చేసిన iQoo Z7 చిప్‌సెట్‌పైనే నడుస్తుంది. బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ AnTuTuలో iQoo హ్యాండ్‌సెట్ 7,34,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసింది. అలాగే Geekbenchలో 1,186 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ ఐకూ స్మార్ట్ ఫొన్ 7.36mm మందంతో స్లిమ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. iQoo Z9 5G  ఆండ్రాయిడ్ 14పై నడుస్తుంది.

    స్టోరేజ్ &బ్యాటరీ

    ఐకూ గ్యాడ్జెట్ 6GB, 8GB ర్యామ్ వేరియంట్లతో 128జీబీ స్టోరేజ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉండనుంది. బ్యాటరీ కెపాసిటీ 50000mah కలిగి ఉండి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

    iQoo Z9 Price

    ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో ర్యామ్ వేరియంట్‌ను బట్టి రూ.18,000- రూ.25,000 మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఇక్కడ కొనండి..

    మార్చి 12న లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ ఫోన్ ఐకూ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ సైట్‌లో అందుబాటులో ఉండనుంది. iQoo Z9 ఫొన్‌ కోసం ముందస్తు బుకింగ్స్ కూడా త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

    మొత్తానికి మీడియం బడ్జెట్‌ రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లు అందిస్తున్న స్మార్ట్‌ ఫొన్‌లలో iQoo Z9 ఒకటిగా చెప్పవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv