బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా బాలీవుడ్లో ‘రామాయణం’ (Ramayanam) అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్ (KGF) ఫేమ్ యష్ (Yash) రావణసురుడిగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్‌కు ‘దంగల్’ (Dangal) లాంటి బ్లాక్ బాస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం మూవీ గురించి అంతా మర్చిపోయారు. అయితే తాజాగా సాలిడ్ అప్డేట్ బయటకు రావడంతో అందరిదృష్టి ఈ సినిమాపై పడింది.
షూటింగ్ ప్రారంభం ఆ రోజే!
లేటెస్ట్ బజ్ ప్రకారం.. ‘రామాయణం’ చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 17న అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) కావడంతో సినిమా అనౌన్స్‌కు అదే సరైన సమయంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఎలాంటి ప్రకటను రానుందోనని.. నటీనటుల ఎంపిక గురించి కూడా అనౌన్స్మెంట్ చేస్తారేమోనని అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ‘రామాయణం’కు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ కూడా ముంబయిలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందని టాక్.
ఆ స్టార్లను సాయిపల్లవికి అవకాశం!
‘రాయాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు తొలుత అలియా భట్ (Alia Bhatt), దీపికా పదుకొణె (Deepika Padukone), కరీనా కపూర్ (Kareena Kapoor)ల పేర్లను మూవీ టీమ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరికీ సాయిపల్లవి (Sai Pallavi)ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సీతాదేవి పాత్రకు సాయిపల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావించిందట. ఆమె సహజసిద్ధమైన నటన ఆ పాత్రకు చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్కార్ విన్నింగ్ కంపెనీతో గ్రాఫిక్స్!
రామాయణం చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలని డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) భావిస్తున్నారట. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆయన జాగ్రత్తపడుతున్నారట. గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ కంపెనీనే.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
అమీర్‌ఖాన్ కొడుకుతో సినిమా
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan)తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబర్లో ప్రారంభమైంది. లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటూ సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది.
సాయిపల్లవి ఫూచర్ ప్రాజెక్ట్స్
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్గా నాగచైతన్య (Naga Chaitanya)తో ‘తండేల్’ (Thandel)లో చేయగా ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ (Siva Karthikeyan)తో ‘అమరన్’ (Amaran) చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్