• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2

    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. గురువారం (డిసెంబర్‌ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ బన్నీ యాక్టింగ్‌ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్‌ నటన బాగుందని ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్‌ హిట్‌ టాక్‌ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్‌ లభించాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    డే 1 కలెక్షన్స్‌ ఎంతంటే..

    అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్‌ 5) వరల్డ్‌ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్‌ బాస్టర్‌ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్‌ వసూలైనట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే హైయస్ట్‌ ఓపెనింగ్స్‌ అని వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి. 

    రికార్డులు గల్లంతు

    తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. ‘బాహుబలి 2’ రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294  కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసింది. అటు నార్త్‌లోనూ ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్‌ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్‌ ఇచ్చాడు. 

    బెనిఫిట్‌ షోలు రద్దు

    హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ (Pushpa 2 Movie Box Office Collection) సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఓ బాలుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. బెన్‌ఫిట్‌షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నందున వాటిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారకులపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv