నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
దర్శకత్వం : డా. హరిత గోగినేని
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ
నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
విడుదల తేదీ: డిసెంబర్ 14, 2024
ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్ రోల్‌లో నటించిన హారర్ చిత్రం ‘ఫియర్’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్ ఎలిమెంట్స్ ప్రతీ ఒక్కరినీ థ్రిల్ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్ సంపత్ (అరవింద్ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review)
ఎవరెలా చేశారంటే
నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్ కథతో పాటే ట్రావెల్ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘ఫియర్’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్ ఫ్లాష్ బ్యాక్ ఫార్మెట్ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్ వర్క్ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- వేదిక నటన
- ఫియర్ ఎలిమెంట్స్
- ట్విస్టులు
మైనస్ పాయింట్స్
- కథనంలో తడబాటు
- సాగదీత సీన్స్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!