• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mufasa: The Lion King Leak: ‘ముఫాసా’కు బిగ్‌షాక్‌.. ఆన్‌లైన్‌లో ఫుల్‌ HD మూవీ లీక్‌

    యావత్‌ సినీ లోకం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King చిత్రం ఇవాళే (డిసెంబర్‌ 20) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. భారత్‌లో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా అందు బాటులోకి వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’కు విశేష స్పందన వస్తోంది. హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ‘ముఫాసా’పై కాసుల వర్షం ఖాయమని అంతా భావిస్తున్న తరుణంగా ఈ మూవీకి బిగ్‌ షాక్‌ తగిలింది. సినిమా విడుదలై 24 గంటలు గడవకముందే ఈ మూవీ పైరసీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. 

    పైరసీ సైట్స్‌లో ప్రత్యక్షం

    హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రం పైరసీ బారిన పడింది. ప్రముఖ పైరసీ సైట్స్‌ అయిన మూవీరూల్జ్ (Movierulz), తమిళ్‌ రాకర్స్‌ (Tamilrockers), ఫిల్మీజిల్లా (Filmyzilla), మూవీస్‌దా (Moviesda), టెలిగ్రామ్‌ ఛానెల్స్‌లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. HD, FHD క్వాలిటీతో ఈ మూవీ వీక్షించండంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలా జరగడంతో మూవీ టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

    ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్స్

    ప్రస్తుతం ముఫాసా పైరసీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలిగ్రామ్‌ ఛానల్స్‌లోనూ ఈ సినిమా డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ‘Mufasa: The Lion King Movie Download’, ‘Mufasa: The Lion King Movie HD Download’, ‘Mufasa: The Lion King Tamilrockers’, ‘Mufasa: The Lion King Filmyzilla’, ‘Mufasa: The Lion King Telegram Links’, and ‘Mufasa: The Lion King Movie Free HD Download’ వంటి కీవార్డ్స్‌ నెట్టింట తెగ ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

    పైరసీలో ఆ మజా ఉండదు..

    ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Piracy) లైవ్‌ యానిమేషన్‌ చిత్రంగా రూపొందింది. విజువల్‌ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే మజా వస్తుందని ఫిల్మ్‌ వర్గాలు సూచిస్తున్నాయి. థియేటర్లలో మాత్రమే ఆ వీఎఫ్‌ఎక్స్‌ను అనుభూతి చెందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా 3Dలో ముఫాసా చూస్తే పక్కాగా మరో ప్రపంచంలోకి వెళ్లి వస్తారని పేర్కొంటున్నారు. పైరసీ సినిమా చూస్తే ‘ముఫాసా’ను ఎంజాయ్‌ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. పైరసీ ప్రింట్‌ వీక్షిస్తే అదొక సాధారణ ఫిల్మ్‌గానే కనిపిస్తుందని అంటున్నారు. 

    పైరసీలో చూస్తే చిక్కుల్లో పడ్డట్లే!

    పైరసీ సైట్స్‌లో సినిమాలు చూసేవారికి సైబర్‌ ముప్పు (Mufasa: The Lion King Piracy) అధికంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఇల్లిగల్‌ సైట్స్‌.. మాల్‌వేర్‌, స్పైవేర్‌, ర్యాన్సమ్‌వేర్‌ వంటి సైబర్‌ నేరస్తులకు కేంద్రాలుగా మారాయని తెలియజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సినిమా చూడొచ్చని ఆయా సైట్స్‌లోకి వెళ్తే మీ వ్యక్తిగత సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా మీ బ్యాంక్‌ ఖాతా సమాచారం, పాస్‌వర్డ్స్‌ వారి చేతుల్లోకి వెళ్లి ఆర్థికంగా తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv