గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు మరో 19 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి సారించారు. అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందుకోసం రామ్‌చరణ్‌తో పాటు చిత్ర బృందం ప్రస్తుతం యూఎస్‌లో ల్యాండ్ అయ్యింది.
ఫ్యాన్స్ మీట్‌లో చరణ్ భరోసా
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్‌లో జరగనుంది. అక్కడ డిసెంబర్ 21 రాత్రి 9 గంటలకు ఈవెంట్ మెుదలుకానుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉ.8 గంటలకు ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్‌కు ముందు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్‌లో చరణ్ మాట్లాడారు. తన సోలో మూవీ వచ్చి నాలుగేళ్లకు పైగా అయ్యిందని గుర్తు చేశారు. ‘నా బ్రదర్ తారక్‍తో RRR చేశాను. కానీ సోలో ఫిల్మ్ వచ్చి నాలుగేళ్లకు పైగానే అయింది. మూడున్నరేళ్ల పాటు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం. గేమ్ ఛేంజర్ సినిమా డైరెక్టర్ శంకర్ స్టైల్‍లో ఉంటుంది. సంక్రాంతికి ఈ మూవీ అద్భుతంగా ఉంటుంది. అసలు నిరుత్సాహపరచదు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
డల్లాస్‌లో దిగిన ఎస్.జే.సూర్య
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తమిళ నటుడు ఎస్.జే. సూర్య అమెరికాలో ల్యాండ్ అయ్యారు. డల్లాస్ ఎయిర్‌పోర్టులో ఆయన దిగిన దృశ్యాలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే సూర్యతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. ఫ్యాన్స్‌తో కొద్దిసేపు ముచ్చటించిన అనంతరం సూర్య అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. కాగా, గేమ్ ఛేంజర్ చిత్రంలో అతడు విలన్ పాత్ర పోషించారు. ‘సరిపోదా శనివారం‘కు మించి అతడి నటన ఉంటుందని మూవీలో చేసిన నటుడు శ్రీకాంత్ అన్నారు. దీంతో అతడి రోల్‌పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
దోప్ సాంగ్ రిలీజ్ షురూ..
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. దోప్ పేరుతో సాగే నాల్గో పాటను డల్లాస్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా విశేష స్పందన వచ్చింది. సాధారణ పాటలకు భిన్నంగా ఎంతో ఇన్నోవేటివ్‌గా ఈ పాటను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దీంతో మ్యూజిక్ లవర్స్‌లో ఈ పాటపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అతడి కెరీర్‌లోనే ఈ పాట ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ రన్‌టైమ్ లాక్!
రామ్‌చరణ్ హీరోగా చేసిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మూవీ రన్‌టైమ్ లాక్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. గేమ్ ఛేంజర్ ఫైనల్ ఔట్ పుట్ 2 గంటల 45 నిమిషాలకు లాక్ అయినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. సినిమా చూసి డైరెక్టర్ శంకర్ చాలా సంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. సెన్సార్ బోర్డ్ పర్యవేక్షణ తర్వాత రన్‌టైమ్ ఫైనల్ కానుంది. అదే డీసెంట్ మూవీ కావడంతో ఎలాంటి కత్తెరలు లేకుండా 165 నిమిషాలతోనే సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!