Allu Arjun: లాయర్లను మేనేజ్‌ చేసిన అల్లు అర్జున్‌? వీడియో వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: లాయర్లను మేనేజ్‌ చేసిన అల్లు అర్జున్‌? వీడియో వైరల్‌

    Allu Arjun: లాయర్లను మేనేజ్‌ చేసిన అల్లు అర్జున్‌? వీడియో వైరల్‌

    December 14, 2024

    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. హైకోర్ట్‌ వెంటనే మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ ఇవాళ (డిసెంబర్‌ 14) ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ను ఇలా అరెస్టు చేయడం ఏమాత్రం భావ్యం కాదంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి తప్పుబడుతూ విపక్ష BRS, BJP తీవ్రంగా తప్పుబడ్డాయి. శుక్రవారం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి దీనిపై వివరణ సైతం ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ అరెస్టు అంశాన్ని కాంగ్రెస్‌ నేత తెరపైకి తీసుకొచ్చారు. ఈ కేసులో బన్నీ కుట్ర చేయలేదా? అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు కారణమైంది. 

    తీన్మార్‌ మల్నన్న సంచలన కామెంట్స్

    అల్లు అర్జున్‌ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్‌ మలన్న బన్నీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అతనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) జైలుకు వెళ్లడంలో అర్జున్ అర్జున్ కుట్ర ఉందా? లేదా? ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా? మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు (National Award) వెనక్కి ఇస్తాడా? కాలం సమాధానం చెప్తాది కొన్నింటికి.. అల్లు అర్జున్ నువ్వు కూడా రాత్రి జైల్లో ఒకరోజు ఉన్నావ్ కాదా? అంటూ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యానించారు. ఇటీవల ఎర్రచందనం దొంగకు నేషనల్ అవార్డు రావడమేంటి? అని వ్యాఖ్యానించి తీన్మార్‌ మల్లన్న వార్తల్లో నిలిచారు. 

    లాయర్లను బన్నీ మేనేజ్‌ చేశాడా?

    జానీ మాస్టర్‌ (Jani Master)  జైలుకు వెళ్లడం వెనుక అల్లు అర్జున్‌ ప్రమేయం ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడంటూ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుకు కొద్ది రోజుల ముందే ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. 2022లో రిలీజైన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళం’లోని ‘మేఘం కరుకతా’ పాటకు గాను ఈ అవార్డు వరించింది. అరెస్టు అనంతరం ఈ అవార్డు అందుకునేందుకు హైకోర్టు జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌ సైతం జారీ చేసింది. అయితే అనూహ్యంగా ఈ అవార్డును రద్దు చేసినట్లు 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ ప్రకటించింది. దీంతో జానీ మాస్టర్‌ సహా ఇండస్ట్రీ వర్గాలంతా షాక్‌కు గురయ్యాయి. అప్పట్లో ఈ బెయిల్‌ రద్దుకోసం సుప్రీం కోర్టుకు సైతం మహిళా కొరియోగ్రాఫర్‌ వెళ్లిందని కథనాలు వచ్చాయి. ఒక సాధారణ మహిళా కొరియోగ్రాఫర్‌ సుప్రీం కోర్టు స్థాయిలో లాయర్లను మేనేజ్‌ చేయడం అంత సులువేం కాదు. ఆర్థికంగా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్‌ తెరవెనక సపోర్ట్ ఇచ్చి లాయర్లను మేనేజ్‌ చేయించారన్న రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో అది మరోమరు చర్చకు వచ్చింది. 

    బహిరంగంగానే సపోర్ట్‌

    జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌కు హీరో అల్లు అర్జున్‌ అప్పట్లో బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. తనకు ఆర్థిక సహాయం కింద ఫ్యూచర్‌లో గీత ఆర్ట్స్‌ బ్యానర్‌లో వచ్చే అన్ని ప్రాజెక్ట్‌లకు ఆమెను కొరియోగ్రాఫర్‌గా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బన్నీ టీమ్‌ ప్రకటించింది. అంతేగాకుండా లైంగిక ఆరోపణలు ఎదుర్కోంటున్న జానీ మాస్టర్‌పై విచారణ వేగంగా జరిగి శిక్ష పడేలా చేయాలని అల్లు అర్జున్‌ ఆఫీస్‌ నుంచి ఆదేశాలు సైతం వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు అత్యంత ఆప్తుడిగా ఉన్నందున జానీ మాస్టర్‌పై బన్నీ కక్ష్య పెంచుకున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పవన్‌ను ఏమీ చేయలేక ఇలా జానీ మాస్టర్‌ను టార్గెట్‌ చేశారని కామెంట్స్‌ వినిపించాయి. కాగా, ఏపీ ఎన్నికల సమయంలో జనసేన తరపున జానీ మాస్టర్‌ ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version