Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!

    Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!

    May 21, 2024

    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో బన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినా బన్నీ మాత్రం చాలా సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడుతుంటాడు. సామాన్యుడిగా జీవించేందుకు ఏమాత్రం సంకోచించడు. వివాదంలో చిక్కుకుంటానని తెలిసినా స్నేహం కోసం ఇటీవల వైకాపా నాయకుడి ఇంటికి వెళ్లి మరి బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇటువంటి సందర్భాలు బన్నీ లైఫ్‌లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

    బన్నీ.. సింప్లిసిటీ..!

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌, అతని భార్య ఓ సాధారణ హోటల్‌లో టేబుల్‌పై కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీనిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌.. తమ హీరో సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. లైఫ్‌లో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న జీవిత పాఠాన్ని బన్నీ పాటిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో చేస్తున్నారు. 

    ఎక్కడ జరిగిందంటే?

    ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల జిల్లాలో పర్యటించాడు. అక్కడ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డికి మద్దతు తెలిపాడు. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌కు అభివాదం చేసి.. కొద్ది సేపటికే బన్నీ తిరిగి హైదరాబాద్‌ బయలుదేరాడు. ఈ సందర్భంగా దారిలో ఓ దాబా వద్ద బన్నీ ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ తన భార్యతో కలిసి భోజనం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు తీసిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లు సమాచారం.

    గతంలోనూ ఇలాగే..!

    గతంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ సందర్భంలోనూ బన్నీ రోడ్డు పక్కన టిఫిన్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రంపచోడవరంలో తెల్లవారు జామున షూటింగ్‌కు వెళ్తూ బన్నీ మార్గం మధ్యలో ఓ కాకా హోటల్‌ దగ్గర కారు ఆపాడు. ఎంచక్కా పాకలోకి వెళ్లి టిఫిన్‌ చేశాడు. బయటకొచ్చి తన అసిస్టెంట్‌ను డబ్బులు అడిగి హోటల్‌ యజమాని చేతికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మళ్లీ ఓసారి చూసేయండి.

    ‘పుష్ప 2’తో బిజీ బిజీ..

    ప్రస్తుతం బన్నీ.. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version