ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అప్రిలియా’ (Aprilia) కీలక ప్రకటన చేసింది. సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అప్రిలియా ఆర్‌ఎస్ 457 (Aprilia RS 457) పేరుతో దీన్ని తీసుకురానుంది. మహారాష్ట్ర బారామతిలోని ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేయడం విశేషం. ఈ నయా బైక్ రిలీజ్‌కు సంబంధించిన విషయాలను ఇటలీలోని అప్రిలియా ప్రధాన కార్యాలయం స్వయంగా ప్రకటించింది. స్పోర్ట్స్ బైక్స్ విభాగంలో అతి తక్కువ బేసిక్ ప్రైస్‌తో ఈ బైక్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పింది. కాగా, ఈ బైక్‌కు సంబంధించి అతికొద్ది సమాచారం మాత్రమే బయటకు రివీల్ అయింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బైక్ డిజైన్
Aprilia RS 457 స్పోర్ట్ బైక్ గతంలో వచ్చిన Aprilia RS 660 డిజైన్‌ను పోలి ఉండనున్నట్లు సమాచారం. ట్విన్ LED DRLతో కూడిన LED హెడ్ ల్యాంప్స్, కొద్దిగా వంపు ఉన్న స్మాల్ విండ్ స్క్రీన్‌తో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది.
ఇంజన్ సామర్థ్యం
ఈ బైక్ పేరుకు తగ్గట్లే 457cc శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంది. దీనికి లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 35 KW పవర్‌ను రిలీజ్ చేస్తుంది.
బైక్ బరువు
Aprilia RS 457 అతి తక్కువ బరువుతో తీసుకొస్తున్నారు. దీని బరువు ఇంధనం లేకుండా 159 కిలోలు మాత్రమే ఉంటుంది.
రైడింగ్ మోడ్స్
ఈ బైక్.. మూడు రకాల రైడింగ్ మోడ్స్‌తో రానుంది. తమ రైడ్‌కు అనుగుణంగా ఈ మోడ్స్‌ను త్వరితగతిన మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ఫ్యుయల్ ట్యాంక్
Aprilia RS 457 బైక్ ఎన్ని లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉందో సమాచారం లేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
బైక్ మైలేజ్
Aprilia RS 457 బైక్‌ను శక్తివంతమైన ఇంజిన్‌తో తీసుకొస్తుండటంతో ఇంధన వినియోగం కాస్త ఎక్కువగానే ఉండనుంది. కాబట్టి ఈ బైక్ మైలేజ్ లీటర్‌కు 18 నుంచి 22 కి.మీ మధ్య ఉండొచ్చని ఆటోమెుబైల్ వర్గాలు భావిస్తున్నాయి.
ధర ఎంతంటే?
Aprilia RS 457 బైక్ ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ బైక్ ఇది రూ.4 లక్షల నుంచి రూ. 4.5 లక్షల వరకూ పలకవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్