August Ott Movies: ఆగస్టు, జులైలో ఓటీటీల్లో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ ఇదే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • August Ott Movies: ఆగస్టు, జులైలో ఓటీటీల్లో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ ఇదే

    August Ott Movies: ఆగస్టు, జులైలో ఓటీటీల్లో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ ఇదే

    August 24, 2024

    ఆగస్టు, జులై నెలలో వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలు మిస్‌ అయిన వారు ఓటీటీలో వీటిని నేరుగా వీక్షించవచ్చు. స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంతో పాటు ఆ సినిమాల స్టోరి కూడా మీకోసం అందిస్తున్నాం. మరి మీ అభిరుచికి తగ్గ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

    ఆగస్టు నెలలో ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

    తూఫాన్ 

    ఈ చిత్రం ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.  ఆగస్టు 9న థియేటర్లలో విడుదలైన  ఈ సినిమా పరాజయం పాలైంది. దీంతో రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఇక  కథలోకి వెళ్తే..సలీం (విజయ్‌ ఆంటోని) ఇండియన్‌ సీక్రెట్‌ ఏజెన్సీలో ఏజెంట్‌గా చేస్తుంటాడు. ఏకాంతంగా గడిపేందుకు అండమాన్‌ ద్వీపానికి వస్తాడు. ఓ శునకాన్ని కాపాడే క్రమంలో అతడికి సౌమ్య (మేఘా ఆకాశ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే సౌమ్యకు స్థానిక వడ్డీ వ్యాపారి డాలి నుంచి సమస్యలు ఎదరవుతుంటాయి. ఇంతకీ ఏంటా ఆ సమస్య? ఆమెకు సలీం ఎలా అండగా నిలిచాడు? డాలిని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.

    కల్కి 2898 ఏడీ

    ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌స్ట్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో క‌ల్కిని వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్ష‌న్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో స్టార్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. 

    రాయన్‌

    ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్‌’ (Raayan). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొని భారీ వసూళ్లు సాధించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారం అవుతోంది. ఇందులో టాలీవుడ్‌ నటుడు సందీప్‌ కిషన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. కాళిదాస్‌ జయరామ్‌, దుషారా విజయన్‌, ఎస్‌.జె సూర్య, శరవణన్‌ ఇతర పాత్రల్లో కనిపించారు. 

    Grrr

    ఈ చిత్రం ఆగస్టు 20నుంచి  డిస్నీ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. హాట్‌ స్టార్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా కథలోకి వస్తే.. ఒక తాగుబోతు వ్యక్తి ఓ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశిస్తాడు. దీంతో అతన్ని రక్షించేందుకు సెక్యురిటీ గార్డ్‌ రంగంలోకి దిగుతాడు. వారిద్దరు ఆ సింహాం బారి నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అన్నది స్టోరీ.

    మై ఫర్‌ఫెక్ట్ హస్బెండ్

    ఈ చిత్రం ఆగస్టు 16 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  పాజిటివ్ టాక్ రావడంతో…ఓటీటీలో టాప్‌ ట్రెండ్ అవుతోంది. ఇక కథలోకి  వస్తే.. సత్యరాజ్‌ ఉమెన్స్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తుంటారు. భార్య రేఖ తన భర్త పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరని గర్వపడుతుంటుంది. అయితే సత్యరాజ్‌ బాల్యంలో ఓ అమ్మాయిని ఇష్టపడతారు. ఇన్నాళ్ల తర్వాత ఆమె సత్యరాజ్‌ లైఫ్‌లోకి వస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన రేఖ ఏం చేసింది? గతంలో ఏం జరిగింది? అన్నది స్టోరీ.

    ఎవోల్

    ఈ చిత్రంలో బొల్డ్‌ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమాను మేకర్స్ థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఎవోల్ చిత్రం ఆహా ఓటీటీలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. ఇద్దరు స్నేహితులతో ఓ అమ్మాయి ఒకేసారి ప్రేమలో పడుతుంది. వారికి శారీరకంగా దగ్గరవుతుంది. ఆయితే ఆ ఇద్దరిని ఆమె నిజంగానే ప్రేమించిందా? లేదా ట్రాప్‌ చేసిందా? ఈ లవ్‌ స్టోరీ చివరికీ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.

    మనోరథంగల్‌ (Manorathangal)

    కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ నటించిన లేటెస్ట్‌ సిరీస్‌ ‘మనోరథంగల్‌’.  తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ ఆగస్టు 15న ఓటీటీలో విడుదలైంది. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్‌.టి వాసుదేవన్‌ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు. 

    వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)

    ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో ‘వీరాంజనేయులు విహార యాత్ర‘ పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ చిత్రం ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు.

    డార్లింగ్‌

    ప్రియదర్శి, నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ (Darling) థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.

    భారతీయుడు 2

    కమల్‌ హాసన్‌ (Kamal Hassan), శంకర్‌ (Director Shankar) కాంబోలో రూపొందిన ‘భారతీయుడు 2’  (Bharateeyudu 2) చిత్రం ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తమిళం, తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. జులై 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలను సైతం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులను ‘భారతీయుడు 2’ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. 

    టర్బో

    టర్బో చిత్రం ఆగస్టు 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించింది. ఇక కథలోకి వెళ్తే..ట‌ర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవ‌ర్‌. స్నేహితుడు జెర్రీ ప్రేమను గెలిపించే క్రమంలో ఓ యువతిని ఎత్తుకొస్తాడు. పోలీసులు కేసుపెట్టడంతో చెన్నైకి పారిపోతాడు. కట్‌ చేస్తే జెర్రీని ఓ గ్యాంగ్‌స్టర్‌ మనుషులు హత్య చేస్తారు. అతడి ప్రేయసిని చంపేందుకు యత్నిస్తారు. ఆమెను జోస్‌ ఎలా కాపాడాడు? జెర్రీని ఆ గ్యాంగ్‌స్టర్‌ ఎందుకు చంపాడు? స్నేహితుడి చావుకి జోస్‌ ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.

    తెప్ప సముద్రం

    ఈ చిత్రం ఆగస్టు 3 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వీక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కథలోకి వెళ్తే..తెప్ప సముద్రం అనే గ్రామంలో స్కూల్‌ పిల్లలు మాయమవుతుంటారు. దీనిని కనిపెట్టేందుకు ఎస్సై గణేష్‌ (చైతన్య రావు) రంగంలోకి దిగుతాడు. మరోవైపు రిపోర్టర్‌ ఇందు (కిశోరి ధాత్రిక్‌) కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో వారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి? ఆ వాస్తవాలు ఏంటి? గణేష్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది స్టోరీ.

    TitleRelease DatePlatformType
    Sakhahaari 24 August 2024AhaFilm
    Toofan23 August 2024Prime VideoFilm
    Raayan23 August 2024Prime VideoFilm
    Kalki 2898 AD22 August 2024Prime VideoFilm
    Kaalarathri17 August 2024AhaFilm
    Veeranjaneyulu Viharayathra14 August 2024ETV WinFilm
    Darling13 August 2024Disney+ HotstarFilm
    Blink (Telugu)12 August 2024Prime VideoFilm
    Derick Abraham10 August 2024AhaFilm
    Bharateeyudu 29 August 2024NetflixFilm
    The Birthday Boy9 August 2024AhaFilm
    D Block8 August 2024ETV WinFilm
    Theppa Samudram3 August 2024AhaFilm
    Brinda2 August 2024Sony LIVSeries
    Satyabhama2 AugustETV WinFilm
    Rakshana01 Aug 2024AhaFilm
    Saripodhaa SanivaaramSoonNetflixFilm
    Double iSmartSoonPrime VideoFilm
    Mr. BachchanSoonNetflixFilm

    జులై నెలలో ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

    అహం రీబూట్‌

    ప్రముఖ నటుడు సుమంత్‌ (Sumanth) హీరోగా సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘అహం రీబూట్’ (Aham Reboot) చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లను స్కిప్‌ చేస్తూ జులై 1 నుంచి  ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఎంతో ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఒకే క్యారెక్టర్‌తో ఒకే రూమ్‌లో ఓ రేడియో షో బ్యాగ్‌డ్రాప్‌తో ‘అహం రీబూట్‌’ కథ సాగుతుంది. 

    శశి మథనం

    రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు వెబ్‌సిరీస్‌ శశి మథనం (Shashi Madhanam Web Series).. ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘శశిమథనం’ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    మీర్జాపూర్‌ సీజన్‌ 3

    అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్‌ సిరీస్‌కు ఎంత పెద్ద క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని నుంచి వచ్చిన రెండు సిరీస్‌లు హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఈ వారం ‘మీర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3) రాబోతోంది. అమెజాన్‌ వేదికగా జులై 5 నుంచి  స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. సీజన్‌ 2 ముగింపులో మున్నా (దివ్యేంద్రు శర్మ).. గుడ్డు (అలీ ఫజల్‌) చేతిలో చనిపోయిన తర్వాత మీర్జాపూర్‌ సింహాసనం గుడ్డు కాళ్ల దగ్గరకు వస్తుంది. ఖాలీన్‌ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) చేతిలోని మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసించాడు? గుడ్డును చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవడానిలి లోకల్‌ గ్యాంగ్స్ ఏం చేశాయి? వారిపై గుడ్డు ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది సీజన్‌ 3లో చూపించనున్నారు. 

    మహారాజా

    తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్‌ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. 

    ధూమం

    మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

    హాట్ స్పాట్ 

    హాట్ స్పాట్ సినిమా జులై 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్‌ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.

    ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం)

    స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంది.

    బహిష్కరణ

    ఈ చిత్రం జులై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం కథలోకి వెళ్తే.. పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్‌) ప్రెసిడెంట్‌. ఊర్లో ఆయన మాటే శాసనం. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్‌) పుష్పను ప్రేమిస్తాడు. శివయ్య చేసిన కుట్రతో దర్శి మరదలిని పెళ్లి చేసుకుంటాడు. ఓ కేసులో జైలుకు కూడా వెళ్తాడు. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై పుష్ప ఎలాంటి పోరాటం చేసింది? అన్నది స్టోరీ.

    నాగేంద్రన్ హనీమూన్స్

    ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో జులై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. నాగేంద్రన్‌ పనిపాట లేని సోమరిపోతు. స్నేహితుడు సలహా మేరకు కువైట్‌ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. డబ్బు అవసరం పడటంతో కట్నం కోసం ఒకరికి తెలియకుండా ఒకరిని ఐదుగురిని పెళ్లి చేసుకుంటాడు. చివరిగా మొరి (అమ్ము అభిరామి) అనే అమ్మాయితో జరిగే పెళ్లితో నాగేంద్రన్ జీవితం మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.

    రాజు యాదవ్‌

    గెటప్‌ శ్రీను కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju Yadav). మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా జులై 24న ఓటీటీలోకి వచ్చింది. ‘ఆహా’ (Aha) ఈ సినిమాను వీక్షించవచ్చు. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీను.. ఓ సమస్య ఉన్న వ్యక్తిగా నటించి, నవ్వులు పంచారు. హీరోయిన్‌గా అంకిత కారాట్‌ ఆకట్టుకున్నారు. 

    శాఖాహారి

    ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రం చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలోనూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. సుబ్బన్న ఓ టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుంటాడు. ఓ రోజు విజయ్‌ అనే ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకొని గాయాలతో సుబ్బన్న దగ్గరకు వస్తాడు. అతడి వద్ద ఆశ్రయం పొందుతూ చనిపోతాడు. మరోవైపు అతడ్ని వెతుక్కుంటా ఎస్సై మల్లిఖార్జున వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? శవాన్ని కనిపించకుండా సుబ్బన్న ఏం చేశాడు? అసలు విజయ్‌కు జరిగిన అన్యాయం ఏంటీ? సుబ్బన్న ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.

    TitleRelease DatePlatformType
    Aham Reboot01 July 2024AhaFilm
    Market Mahalakshmi04 July 2024AhaFilm
    Shashi Madhanam 04 July 2024Etv winWeb series
    Malayalee From India (Telugu)05 July 2024Sony LIVFilm
    Aarambham05 July 2024Prime VideoFilm
    Hit List09 July 2024Prime VideoFilm
    Plot11 July 2024ETV WinFilm
    Maharaja (Telugu)12 July 2024NetflixFilm
    Jilebi13 July 2024AhaFilm
    Harom Hara16 July 2024Aha & ETV WinFilm
    Music Shop Murthy16 July 2024ETV WinFilm
    Hot Spot (Telugu)17 July 2024AhaFilm
    Aadujeevitham (Telugu)19 July 2024NetflixFilm
    Nagendran’s Honeymoons19 July 2024HotstarWeb series
    Raju Yadav24 July 2024AhaFilm
    Shakhahaari24 July 2024Prime VideoFilm
    Yevam25 July 2024AhaFilm
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version