• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ నెల 21న ఇస్రో కీలక ప్రయోగం

    ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ తొలి ప్రయోగాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌ను పరీక్షించనున్నారు. మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడంపై టెస్ట్ నిర్వహించనున్నారు.

    నడిరోడ్డుపై మహిళ యోగా.. షాక్ ఇచ్చిన పోలీసులు

    రోడ్డు మధ్యలో యోగా చేసిన మహిళకు పోలీసులు షాక్ ఇచ్చారు. గుజరాత్‌లోని ఓ ప్రధాన రహదారిపై దినా పర్మార్ అనే మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు గాను ఆమెకు జరిమానా విధించారు. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/Cxh9J7kRmzA/?utm_source=ig_embed&ig_rid=8c60559a-21b9-487c-af36-890c82d7094c

    అంబానీ @రూ.8.08 లక్షల కోట్లు

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.8.08 లక్షల కోట్ల సంపదతో దేశంలోని కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెందగా.. గౌతమ్ అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. దేశంలోని 138 నగరాల నుంచి 1319 మంది బిలియనీర్లకు హురున్ జాబితాలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఈ జాబితాలో ఉండగా.. వీరి సంపద రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది.

    దసరా వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం

    దసరా మహోత్సవాలకు రావాలని సీఎం జగన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లన్న ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై, 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు ఆహ్వానపత్రికలు అందజేశారు.

    నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

    ఎన్నికల నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 46 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉండగా, అందులో 13 తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈనెల 31 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

    17 రోజులు.. 41 భారీ బహిరంగ సభలు

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన 17 రోజుల్లో 41 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నవంబంర్ 3వ తేదీ నాటికే సీఎం కేసీఆర్ 26 సభలకు హాజరయ్యేలా ప్రణాళిక రచించారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

    హస్తకళల మేళాకు విశేష స్పందన

    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హస్తకళల ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వరుసగా ఉన్న నేపథ్యంలో ఈ ఎగ్జిబిషన్‌ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొండపల్లి చెక్క బొమ్మలు, దుస్తులు, అలంకరణ సామగ్రి, వంట దినుసులు.. ఇలా అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పట్టణంలోని లహరి గార్డెన్స్‌లో 15 రోజుల పాటు కొనసాగే ఈ మేళాలో 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు.

    ట్రంప్‌ పోలికలతో వ్యక్తి.. వీడియో వైరల్

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఓ వ్యకి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అతడు పాకిస్తాన్‌లోని పంజాబ్ సాహివాల్ జిల్లాలో కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు. ట్రంప్ పోలీకలు ఉన్న ఆ వ్యక్తి సరదగా పాట పాడుతూ ఉన్న ఓ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 2021లో సైతం కుల్ఫీలు అమ్ముకుంటూ పాటలు పడిన ఇతడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. https://www.instagram.com/reel/CyDI4UpOOuT/?utm_source=ig_embed&ig_rid=8cea3ffe-9c46-4d30-afa4-cbe6900ec7db

    టీమిండియా ప్లేయర్లకు ప్రతిష్టాత్మక అవార్డు

    ఇద్దరు టీమిండియా ప్లేయర్లతో పాటు ఓ ఇంగ్లండ్ ఆటగాడు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికయ్యారు. శుభ్‌మన్ గిల్, సిరాజ్, డేవిడ్ మలాన్ 2023 సెప్టెంబర్ నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సాధించారు. గత నెలలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేసిన గిల్ 480 పరుగులు చేశాడు. ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపై సిరాజ్ రెచ్చిపోయాడు. ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ గత నెలలో 105.72 స్ట్రైక్ రేట్ సాధించాడు.

    ఎన్నికల తేదీల విషయంలో బీజేపీ వ్యూహం..?

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే తేదీల విషయంలో సీఈసీని బీజేపీ ప్రభావితం చేసిందా అనే అనుమానం కలుగుతోందని పలువురు అంటున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం.. ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో చివరలో ఎన్నికలుండటమే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. ముందుగా తాము అధికారంలో ఉన్న చోట ఎన్నికలు పూర్తి చేస్తే ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒత్తిడి లేకుండా ప్రచారం చేసుకునేందుకే ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.