• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తోన్న ‘మ్యాడ్’

    యువ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.10.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. యూఎస్‌లో ఈ చిత్రం రూ.2.5 లక్షల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మేకర్స్ అంచనాలకు మించి విజయం సాధించడంతో మూవీ టీం సంబరాలు చేసుకుంటోంది. గౌరీప్రియ, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించాడు.

    రాళ్ల మధ్యలో యువతి.. 12 గంటలు నరకం

    విశాఖపట్నం అప్పికొండ బీచ్‌లో రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువతి 12 గంటల పాటు నరకం అనుభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య, వర్మ రాజు ఈనెల 2 నుంచి అప్పికొండ ప్రాంతంలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఫొటోలు తీసుకుంటుండగా కావ్య రాళ్ల మధ్యలో జారిపడిపోయింది. దీంతో రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం ఆమె కేకలు విన్న జాలర్లు అతికష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, కావ్య కనిపించడం లేదంటూ ఆమె తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    మంచి ప్రదర్శనే.. అయినా విమర్శలు

    గతంలో తాను మంచి ప్రదర్శన చూపినప్పటికీ క్రికెట్ అభిమానుల నంచి విమర్శలు వచ్చేవని, అలాంటి సమయంలో బాధగా అనిపించేదని ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ సమయంలో గాయపడి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రాహుల్ ఆసియా కప్‌లో తిరిగి జట్టులో చేరాడు. 5 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నానని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి ఒక్కరి కల అని, ఇప్పడు సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో రాహుల్ కీలకంగా వ్యవహరించాడు.

    మా బావకి ‘మ్యాడ్’ బాగా నచ్చింది: నార్నే నితిన్

    ‘మ్యాడ్’ మూవీ చాలా బాగుందని తన బావ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారని యంగ్ హీరో నార్నే నితిన్ అన్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. టీం మొత్తం కష్టపడి పనిచేయడంతోనే ఈ విజయం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియారెడ్డి, అనంతిక, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    హమాస్ మిలిటెంట్ల మారణ హోమం

    ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణ హోమం సృష్టించారు. ఒకే సారి 260 మంది ప్రాణాలు తీసి కర్కశంగా వ్యవహరించారు. గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్ వద్ద జరిగిన ఓ మ్యాజిక్ పార్టీకి దాదాపు 3 వేల మంది హాజరుకాగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో వారంతా కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

    త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్-3

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 త్వరలో ప్రారంభం కానుంది. మొదటి రెండు సీజన్లకు మించి ఈసారి వినోదం పంచేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దసరా నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా, బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది.

    శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి

    సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శోభ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. Kalvakuntla Shobha, wife of Telangana CM #KCR, went to #Tirumala Monday … Read more

    ‘ఇండియన్-2’పై క్రేజీ అప్డేట్

    విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ డబ్బింగ్ చెబుతున్న ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. దీంతో మూవీ షూటింగ్ డబ్బింగ్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

    గ్రూప్2 పరీక్షలు జరిగేనా..?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పలు రకాల పోటీ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్2 పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల ప్రక్రియతో పాటు గ్రూప్స్ పరీక్షలకు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అవసరం ఉండటమే దీనికి కారణం. నవంబర్ 30న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 25 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్‌టీ-ఎస్‌జీటీ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం ఉంది.

    ఇకపై నకిలీ సర్టిఫికెట్లకు చెక్

    నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. అన్ని యూనివర్సిటీలు డిజీ లాకర్‌ను వినియోగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి వర్సిటీకి ప్రత్యేక కోడ్ కేటాయించింది. విద్యార్థులకు సంబంధించిన విద్యార్హత ధృవపత్రాలను ఈ డిజీ లాకర్‌లో భద్రపరుస్తారు. విద్యార్థులు తమకు ఎప్పడు అవసరమైనా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో సర్టిఫికెట్లపై ఉన్న పేర్లు, సంవత్సరాలను మార్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టే అవకాశం ఉంది.