• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 15 నుంచి ప్రజల్లోకి సీఎం కేసీఆర్

    ఈ నెల 15 నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్స్ అందజేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి.. 17న సిద్ధిపేట, సిరిసిల్ల.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

    2028 ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్

    2028లో లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ సైతం ఉండనుంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడలను సైతం చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో కేవలం 1900 సంవత్సరంలో ప్యారీస్‌లో జరిగిన క్రీడల్లో మాత్రమే క్రికెట్ ఉంది. మళ్లీ 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. ఇటీవల జరిగిన ఏసియన్ గేమ్స్‌లో సైతం క్రికెట్‌ను చేర్చారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటే టీ20 ఫార్మాట్‌లో ఉండే అవకాశం ఉంది.

    యుద్ధం కోరుకోలేదు.. కానీ తప్పడం లేదు

    ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తాము మొదలు పెట్టలేదని.. అయితే ముగింపు మాత్రం తామే ఇస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్దం కోరుకోలేదని, అయినప్పటికీ దేశం కోసం తప్పడం లేదని చెప్పారు. హమాస్ సైతం ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థేనని, ప్రజలంతా ఏకమై దానిని ఓడించాలని కోరారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనని ఆయన అన్నారు.

    ఉచిత హామీలను అడ్డుకోలేం: సీఈసీ

    ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను తాము అడ్డుకోలేమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఎన్నికల హామీలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలను ఎప్పటి లోగా అమలు చేస్తాయో రాజకీయ పార్టీలు చెప్పేలా ఒక విధానం తీసుకొచ్చామని చెప్పారు. హామీలను ఏ విధంగా, ఎప్పటి లోగా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని రాజీవ్ పేర్కొన్నారు.

    ‘ఛాంపియన్‌తో అల్ఫాహారం.. మర్చిపోలేను’

    టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. ఈ మేరకు కొన్ని ఫొటోలను రాహుల్ ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వీరితో పాటు యంగ్ హీర్ ఆనంద్ దేవరకొండ ఉన్నాడు. ‘‘నాకు తెలిసిన వారెవరైనా లేదా ట్విటర్‌లో నన్ను అనుసరించే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఛాంపియన్‌తో ఈ అల్ఫాహారం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఏసియన్ గేమ్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు.

    ట్రోలర్స్‌పై మండిపడిన అరియానా

    బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు ట్రోల్ చేయడంపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను లావుగా ఉన్నానని, ఆంటీలా అయ్యానని కొంత మంది వేస్ట్ ఫెలోస్ అంటున్నారని మండిపడింది. నేను ఎలా ఉంటే వారికి ఏంటని ఆమె ప్రశ్నించింది. వారికి అంతగా ఇబ్బందిగా ఉంటే తనను ఆన్‌ఫాలో చేయాలని సూచించింది. ఖాళీగా ఉంటే ఏదైనా పని చేసుకోవాలని, అవతలి వాళ్ల గురించి చెడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. https://www.instagram.com/reel/Cx2bgxIxK_S/?utm_source=ig_embed&ig_rid=2f34065e-5a0c-49e7-8d53-d5e8af4a992b

    మహేశ్‌ ‘గుంటూరు కారం’పై ఆసక్తికర చర్చ

    సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ ఇంటర్వెల్ సీన్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ మొత్తం ఈ సీన్ చుట్టూనే తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలోకి రానుంది.

    ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

    నిన్న విడుదలైన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 5 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. చత్తీస్‌ఘర్‌లో నవంబర్ 7, 17న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 23న.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

    క్రికెట్‌లో ఇలాంటివి సాధారణం: కమిన్స్

    ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంపై క్రికెటర్ కమిన్స్ స్పందించాడు. తాము 200 పరుగులకే పరిమితం కావడం ఇబ్బంది కలిగించిందని, మరో 50 పరుగులు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మిచెల్ మార్ష్ కోహ్లీ క్యాచ్‌ను మిస్ కావడం గురించి అప్పుడే మర్చిపోయానని, ఇలాంటివి క్రికెట్‌లో సర్వసాధారణం అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ లైఫ్ తర్వాత కోహ్లీ మెరుగ్గా ఆడి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. https://www.instagram.com/reel/CyI_IFJPRJY/?utm_source=ig_embed&ig_rid=abd1fd86-cc97-4dd2-9e17-74ce4bd3db35