• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అన్నం పెట్టిన అమ్మాయిపైనే అత్యాచారం

    ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. బిహార్‌కు చెందిన ధర్మేందర్, ఓ బాలిక వారం రోజులుగా అద్దె ఇంట్లో ఊంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేందర్ పార్టీ ఇస్తానని చెప్పడంతో అతడి స్నేహితులు ఇంటికి వచ్చారు. వారందరికీ బాలిక వంట చేసి వడ్డించింది. భోజనం చేసిన తర్వాత ధర్మేందర్‌ను బయటకు గెంటేసి ఆమెపై అత్యాచాారానికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    20 నుంచి ఓటీటీలో ‘మామా మశ్చీంద్ర’

    యంగ్ హీరో సుధీర్‌బాబు నటించిన ‘మామా మశ్చీంద్ర’ మూవీ ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఆహాలో సైతం స్ట్రీమ్ కానున్నప్పటికీ ఎప్పటి నుంచి అనేది ఖరారు కాలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి తేజ తదితరులు నటించారు.

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ఖాజీపేట నుంచి పూణె వరకు కొత్తగా మరో ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచే ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పూణె- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఖాజీపేట వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో వరంగల్, జనగామ, భువనగిరితో పాటు మరికొన్ని జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.

    ఐటీ ఉద్యోగులకు మరో ఏడాది నిరాశే

    ఐటీ రంగానికి సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఐటీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 2024లో సైతం ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌కు చెందిన విశ్లేషకులు వెల్లడించారు. అయితే 2025లో మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు 2024ని ‘వాష్ అవుట్’గా పేర్కొంటారని, ఇక 2025పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగితే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్చరించాయి.

    బాలకృష్ణపై శ్రీలీల ప్రశంసలు

    నట సింహం నందమూరి బాలకృష్ణపై నటి శ్రీలీల ప్రశంసలు కురిపించింది. జీవితంలో మర్చిపోలేని అనుభూతులు బాలయ్య తనకు అందించారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘నేను బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటించాను. కొన్ని సీన్లు చేసేటప్పుడు కట్ చెప్పినప్పటికీ ఎమోషనల్ మూడ్‌ నుంచి బయటకు రాలేకపోయాను’’ అని చెప్పింది. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

    ఘనంగా ముగిసిన ఏసియన్ గేమ్స్

    ఏసియన్ గేమ్స్ ముగింపు వేడుకలను చైనా అద్భుతంగా నిర్వహించింది. హాంగ్‌జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా హాకీ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించాడు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసియన్ గేమ్స్‌లో చైనా అత్యధికంగా 383 పతకాలు సాధించగా, భారత్ 107 పతకాలతో నాలుగవ స్థానంలో నిలిచింది.

    క్రికెట్ కామెంటరీతో అలరించిన రవితేజ

    ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రవితేజ క్రికెట్ కామెంటరీ చెప్పారు. ఇతర వ్యాఖ్యాతలతో కలిసి ఓ వరల్డ్ కప్ మ్యాచ్‌కు రవితేజ కామెంటరీ చెప్పడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్, దూకుడు అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా రవిజేత అన్నారు. క్రికెటర్స్ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే సిరాజ్ బయోపిక్‌లో నటిస్తానని చెప్పారు. కాగా, వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    39 మందితో బీజేపీ తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించి ఆశ్చర్యపరిచారు. వరుసగా 5 వారాల పాటు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఈ వారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణలను ఒకేసారి ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అంబటి అర్జున్, అశ్వినీశ్రీ, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో పాటు హీరోయిన్స్ హౌజ్‌లో సందడి … Read more

    పాలస్తీనాకు షాక్ ఇచ్చిన భారత్ హ్యాకర్లు

    పాలస్తీనా, హమాస్‌లకు చెందిన పలు కీలక వెబ్‌సైట్లను భారత్ హ్యాకర్లు హ్యాక్ చేసి గట్టి షాక్ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలకు చెందిన హ్యాకర్లు పాలస్తీనా, హమాస్‌లకు మద్ధతుగా పనిచేస్తున్నారు. వారు ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థకు చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ హ్యాకర్స్ ఫోర్స్’తో పని చేస్తున్న బృందం ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి. పాలస్తీనా ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్లతో పాటు హమాస్ సైట్లను హ్యాక్ చేసి షాక్ ఇచ్చారు.