• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఈడీ నోటీసులు

    సినీ నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు అందజేసింది. 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవల 6 గంటల పాటు నవదీప్‌ను విచారించిన నార్కోటిక్స్ పోలీసులు ఆయన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్ ఆధారంగా నవదీప్‌ను విచారించిన అధికారులు ఆయన వాట్సాప్ చాట్‌ను రిట్రీవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ చాట్ డేటా ఆధారంగా మరోసారి విచారించే అవకాశం ఉంది.

    నా భార్య చెప్తేనే ‘కబీర్‌సింగ్‌’లో నటించా

    కబీర్‌సింగ్‌లో నటించేందుకు మొదట తాను ఒప్పుకోలేదని బాలీవుడ్ నటుడు షాహీద్‌కపూర్ తెలిపారు. తన భార్య మీరా సూచన మేరకే ఈ మూవీ చేేసేందుకు ఒప్పుకున్నానని షాహీద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న అర్జున్‌రెడ్డి హిందీలో రీమేక్ చేయగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని షాహీద్‌కు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో తీసిన సందీప్‌రెడ్డినే హిందీలో సైతం తెరకెక్కించారు. రూ.60 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.350 కోట్ల వసూళ్లు సాధించింది.

    నటిని అవుతానని నేను అనుకోలేదు

    తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. మళయాళం మూవీ ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ప్రియా పాపులర్ అయింది. ఈ సినిమాలోని కన్ను కొట్టే సీన్‌తో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమాలో ప్రియా ఓ పాత్ర చేసింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రియా ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్ క్లినిక్’ మెషిన్

    దేశంలోనే మొదటి సారిగా ‘ఎనీ టైమ్ క్లినిక్’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మెషిన్‌ ద్వారా జ్వరం నుంచి కేన్సర్ వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు స్వయంగా మనమే చేసుకోవచ్చు. దీన్ని తొలిసారిగా చందానగర్‌లోని ప్రణామ్ ఆస్పత్రిలో ప్రారంభించారు. నార్మల్ హెల్త్ చెకప్, జ్వరం, కంటి పరీక్షలు వంటి 75 రకాల టెస్టులు చేసుకునేందుకు ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. మెషిన్‌కు అమర్చిన కెమెరా ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం సైతం ఉంది.

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

    ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు

    ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. వివాదాస్పద గాాజా స్ట్రిప్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు ఈ రోజు తెల్లవారుజామున రాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించామని, 5వేల రాకెట్లతో దాడులు చేశామని చెబుతూ హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది.

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో ఇన్పెక్షన్

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో బాక్టీరియల్ ఇన్పెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    రెండు భాగాలుగా ‘హరిహరవీరమల్లు’

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ చిత్రం రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ హిస్టారికల్ స్టోరీ కావడంతో కథ పెద్దదిగా ఉంటుందని, అందుకే రెండు భాగాలుగా తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేజీఎఫ్, బాహుబలి వంటి చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్ కావడంతో హరిహరవీరమల్లు సైతం భారీ విజయం సాధిస్తుందని పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    ‘జవాన్’ మూవీ భారీ వసూళ్లు

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ఇప్పటికే రూ.560 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే రూ.1.70 కోట్లు రాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నయనతార, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా, సంజయ్ దత్, దీపికా పదుకొనే గెస్ట్ రోల్స్ చేశారు.