• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్‌పై యంగ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై యువ దర్శకుడు నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుందని, అన్నతో ఐరన్ మ్యాన్ వంటి ఓ సూపర్ హిట్ మూవీ తీయాలని ఉందని చెప్పారు. భవిష్యత్తులో కచ్చితంగా ఎన్టీఆర్‌తో అలాంటి సినిమా తీస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘దేవర’తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నారు. అయితే దాని తర్వాత నాగవంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఓ మూవీ చేస్తారనే చర్చ జరుగుతోంది.

    నేడు తలపడనున్న టీమ్స్ ఇవే

    క్రికెట్ ప్రపంచ కప్‌- 2023లో భాగంగా నేడు ఉదయం 10:30 గంటలకు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడనున్నాయి. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనుండగా, సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది.

    ఏసియన్ గేమ్స్‌లో భారత్ రికార్డ్

    ఏసియన్ గేమ్స్‌లో ఈ సారి వంద పతకాలు సాధించి భారత్ రికార్డ్ సృష్టించింది. మన క్రీడాకారులు స్వర్ణం-25, రజతం-35, కాంస్యం-40 పతకాలు సాధించారు. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏసియన్ గేమ్స్‌ పతకాల విషయంలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

    ‘చంద్రయాన్-3’ ఇక ముగిసినట్లేనా..?

    ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని సంస్థ మాజీ చైర్మన్ కిరణ్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 22న చంద్రుడిపై సూర్యోదయం అయిన్పటికీ అవి మేల్కోలేదని, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ఇక ముగిసినట్టేనని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్ ఫలితం ఇప్పటికే నెరవేరిందని, ఈ దేశానికి సాధ్యం కాని పని మనం చేశామన్నారు.

    సంజ్ఞా భాషలోనూ ‘టైగర్ నాగేశ్వరరావు’

    ఈ నెల 19న విడుదలై దసరా బరిలో నిలవనున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని సంజ్ఞా భాషలో ( సైన్ లాంగ్వేజ్) సైతం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ భాషలో విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదేనని, మూవీని ఎక్కువ మందికి దగ్గర చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రవితేజ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈ మూవీకి వంశీ దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు.

    తెలంగాణలో 57 నూతన కోర్టులు

    తెలంగాణలో కొత్తగా 57 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై జరిగే నేరాలను విచారించేందుకు గాను ప్రత్యేకంగా 10 కోర్టులు ఏర్పాటు చేశారు. కొత్త కోర్టుల్లో సిబ్బందిని నియమించేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

    భారీ ప్రయోగానికి సద్ధమవుతోన్న ఇస్రో

    చంద్రయాన్-3 సక్సెస్ అందించిన ఉత్సాహంతో ఇస్రో మరో భారీ ప్రయోగానికి సద్ధమవుతోంది. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీంతో పాటు ఎక్కువ కాలం ప్రయాణించేందుకు వీలుగా మానవ సహిత అంతరిక్ష నౌకను సైతం సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. తాము నిర్మించే స్పేస్ స్టేషన్ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    8న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

    తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 8-10వ తేదీల మధ్య విడుదల కానుంది. అయితే ఆదివారమే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, చత్తీస్‌ఘర్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 10-15 మధ్య ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

    శ్రద్ధాకపూర్‌కు ఈడీ నోటీసులు

    మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడు నటులు నోటీసులు అందుకోగా తాజాగా విచారణకు హాజరు కావాలంటూ శ్రద్ధాకపూర్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ బెట్టింగ్ దందా నిర్వహిస్తుండగా, రోజుకు రూ.200 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. యూఏఈ ప్రధాన కేంద్రంగా యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటుడు రన్‌బీర్‌తో సహా 14 మంది సెలబ్రిటీలు ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

    తిరుపతిలో జంట హత్యల కలకలం

    తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నాందేడ్‌కు చెందిన యువరాజ్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున తన భార్య మనీషా, బామ్మర్ధి హర్షవర్ధన్‌ను యువరాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలతో వెళ్లి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోాయాడు.