• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అదుర్స్’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల!

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో ‘అదుర్స్’ రీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. అయితే ఈ సినిమా ఈ నెల 18న వరల్డ్ వైడ్‌గా థియేటర్ల లో 4కే వెర్షన్ లో రిలీజ్ కాబోతుంది. ఈ రీరిలీజ్‌కి సంబందించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్‌లో నటించి ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించింది. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో పోషించారు.

    దీపావళి పండుగ.. చైనాకు లక్ష కోట్లు నష్టం!

    చైనాను అన్ని విధాలుగా నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్‌కాట్‌ చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ ఏడాదిలో దీపావళి రోజు దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు సుమారు రూ.1లక్ష కోట్లు నష్టం వాటిల్లింది. గతంలో దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. ఈ మేరకు ఓ నివేదిక పేర్కొంది.

    గెలిస్తే 24 గంటలూ తాగునీరు: కేటీఆర్‌

    తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తాజ్‌ డెక్కన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులు వస్తేనే నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు రాకపోకలు చాలా సులువుగా జరగాలన్నారు. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమించామని కేటీఆర్‌ చెప్పారు.

    శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం

    తిరుమల శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. భక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే భక్తులు టీడీపీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తుంది. వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు.

    ‘వీళ్లకంటే రోహిత్‌ ప్రత్యేకం’

    టీమిండియా సారథి రోహిత్‌ శర్మపై మాజీ క్రికెటర్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్‌ దిగ్గజాలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ మాలిక్‌ కూడా హిట్‌మ్యాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ వారందరికంటే ప్రత్యేకం. ఏ బౌలర్నీ అతడు వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. ఎలాంటి బౌలింగ్‌ దాడైనా కానీ.. వారిని దీటుగా ఎదుర్కొంటూ చాలా తేలికగా పరుగులు రాబడతాడు’. అని పాక్ క్రికెటర్లు కొనియాడారు.

    ‘జపాన్’ మరింత డౌన్ ఫాల్..!

    కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన “జపాన్” చిత్రం ఈ నెల 10న థియోటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం రిలీజ్ రోజే అంత పాజిటవ్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. దీనితో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు వీక్ డే లోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం మరింత డౌన్ ఫాల్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళ వెర్షన్‌లో కూడా ఈ చిత్రం దారుణంగా డౌన్ … Read more

    అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు

    AP: తనకు కావాల్సిన బ్రాండ్‌ మద్యం లేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం షాపుకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. విశాఖపట్నం పీఎం పాలెంలో మధు (53) అనే వ్యక్తి మద్యం షాపుకు వెళ్లాడు. ఓ బ్రాండ్‌ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్‌లో అడిగాడు. ఆ బ్రాండ్‌ మద్యం షాపులో లేదని వ్యక్తి చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. దీంతో మధు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్‌పై కుమ్మరించి నిప్పు అంటించాడు. … Read more

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 టికెట్ల విక్రయాలు

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. విశాఖలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న ఆసీస్ భారత్‌తో తలపడనుంది. ఈనేపథ్యంలో 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

    మహిళలతో కాంపౌండర్‌ వికృత చేష్టలు

    అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న మహిళల అసభ్యకర ఫొటోలను తీసి ఓ కాంపౌండర్‌ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటన మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రామ్‌సింగ్‌ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వైద్యుడి వద్దకు వచ్చే మహిళలకు ఇంజక్షన్లు వేసే సమయంలో రహస్యంగా తన సె‌ల్‌ఫోన్‌లో అసభ్యకర చిత్రాలను తీసేవాడు. ఈ క్రమంలో ఓ మహిళ దీన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.

    గోవులతో తొక్కించుకున్న భక్తులు

    మధ్యప్రదేశ్‌లోని బిధావత్‌ గ్రామంలో భక్తులు గోవులతో తొక్కించుకున్నారు. దీపావళి రోజు గ్రామస్థులు గోవులకు పూజలు చేశారు. ఆ తర్వాత వాటన్నిటినీ ఒకేచోటు చేర్చారు. డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. తర్వాత పురుషులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని భక్తులు పేర్కొన్నారు. గోమాతలో దేవతలు ఉంటారని అందుకే వాటితో తొక్కించుటామని చెబుతున్నారు.