• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kerala: నరరూప రాక్షసుడికి ఉరిశిక్ష

    అయిదేళ్ల చిన్నారికి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కేరళ హైకోర్టు మరణ శిక్ష విధించింది. అంతేకాకుండా యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించడంతో పాటు రూ.7.3 లక్షల జరిమానా కూడా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. కేరళలో అస్ఫాక్‌ ఆలం (28) అయిదేళ్ల బాలికకు మిఠాయిలు కొనిపెడతానని చెప్పి బయటకు తీసుకుపోయాడు. తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన బాలికకు మద్యం తాగించి పదేపదే అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక దుస్తులనే మెడకు బిగించి హతమార్చాడు.

    నేడు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్

    వన్డే వరల్డ్ కప్ భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ హైహోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలైన టీమిండియాకు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దక్కింది. తొలి సెమీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా మరో గెలుపు కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమి లేదు: రేవంత్

    బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.

    ఓటీటీకి స్టార్ క్రికెటర్ జీవిత కథాచిత్రం

    శ్రీలంక స్టార్ క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘800’ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్‌ 2 నుంచి జియో సినిమా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటు సింహళ భాషలో విడుదలవుతోంది.. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమాలో తెరకెక్కింది. Courtesy Twitter: taran adarsh Courtesy Twitter: 123telugu

    పరీక్షల్లో తలను కవర్‌ చేయడం నిషేధం

    కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. బ్లూటూత్ డివైసెస్‌ ద్వారా అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

    ఓటు వేసే ముందు ఆలోచించండి: KCR

    కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొర్రూరులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు అపేస్తుంది’.అని కేసీఆర్ పేర్కొన్నారు.

    విడుదలకు సిద్ధమైన యాక్షన్‌ థ్రిల్లర్‌

    పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరు 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ.ఎం. నిర్మించారు.

    బాక్సాఫీస్ వద్ద టైగర్-3 సెంచరీ

    సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్ రావడంతో మొదటి రోజు రూ.44.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు రూ.57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 102 కోట్ల వసూళ్లు సాధించింది.

    ‘బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధమే’

    పాలస్తీనాలోని హమాస్‌ మిలిటెంట్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ వద్ద బందీలుగా ఉన్నవారిలో 70 మంది మహిళలు, చిన్నారుల్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఐదు రోజులపాటు యుద్ధాన్ని నిలిపివేయాలని షరతు విధించారు. ఆ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేసినా, ఆలస్యం చేసినా.. ఇజ్రాయెల్‌దే బాధ్యతని చెప్పారు. ఈ మేరకు హమాస్ మిలిటెంట్‌లు ఆడియో రికార్డును విడుదల చేశారు.

    ట్రంప్ సోదరి మృతి

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట విషాదం నెలకొంది. ట్రంప్‌ సోదరి మేరియన్ ట్రంప్ కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె అనారోగ్య కారణాలతో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మేరియన్ న్యూజెర్సీలో ఫెడరల్‌ న్యాయమూర్తిగా పని చేసి 2019లో పదవీ విరమణ పొందారు. గతేడాది ట్రంప్‌ సోదరడు రాబర్ట్‌ ట్రంప్‌ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.