• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 50 సెంచరీలు.. కోహ్లీపై సినీ ప్రముఖుల ప్రశంసలు

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక 50 శతకాలు నమోదు చేసి కోహ్లీ, సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును అధిగమించాడు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. అగ్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్‌, సాయిధరమ్‌ తేజ్‌, వెంకటేష్‌లతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు ట్వీట్ చేస్తూ కోహ్లీని ప్రశంసించాయి.

    ఆ సమయంలో నా కెంతో బాధేసింది: షమీ

    కేన్ విలియమ్సన్ క్యాచ్ డ్రాప్‌పై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కీలకమైన కేన్‌ విలియమ్సన్ క్యాచ్‌ను మిస్‌ చేశానని చెప్పాడు. ఆ సమయంలో తనకెంతో బాధేసిందన్నాడు. ‘దీంతో బౌలింగ్‌లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్‌ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడేస్తున్నారు. పిచ్‌ కూడా చాలా బాగుంది. కానీ, తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు అందుకే, నేను శైలిలోనే బంతులను సంధించా’. అని షమీ చెప్పుకొచ్చాడు.

    కృష్ణ వర్ధంతి.. మహేశ్‌ బాబు కీలక నిర్ణయం

    టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు మరోసారి ఉదారత చాటుకున్నారు. ఇప్పటికే తన ఫౌండేషన్‌ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. మహేష్ తన తండ్రి కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘సూపర్‌స్టార్‌ కృష్ణ ఎడ్యుకేషనల్‌ ఫండ్‌’ ద్వారా 40మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌ అందించనున్నారు.

    నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు వీటిపై ప్రభావం చూపుతున్నాయి. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీలు నష్టాల్లో ట్రెడవుతున్నాయి.

    కెప్టెన్సీకి బాబర్‌ గుడ్‌బై

    పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్నీకి బాబర్ అజామ్ గుడ్‌బై చెప్పాడు. వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్టు జట్టుకు షాన్‌ మసూద్‌ను, టీ20లకు షహీన్‌ షా అఫ్రిదిని కెప్టెన్లుగా పీసీబీ నియమించింది. అయితే ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పాక్ ఐదు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

    నేడు దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ

    నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మరో సెమీస్‌ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. ప్రపంచకప్‌లో జోరు కొనసాగిస్తూ టీమిండియా ఇప్పటికే ఫైనల్‌‌కు చేరింది. మరి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి రోహిత్‌ సేనకు ఢీకొననుంది ఎవరో నేడు తేలిపోనుంది.

    సెమీస్‌ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం: రోహిత్

    నిన్న న్యూజిలాండ్‌తో విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌‌పై స్పందించాడు. వాంఖడే మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడామని చెప్పారు. అలాగని రిలాక్స్‌గా ఉండకూడదన్నారు. ‘వీలైనంత త్వరగా బాధ్యతలను ముగించాలి. సెమీస్‌ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం. లక్ష్య ఛేదనలో రన్‌రేట్‌ 9కి కంటే ఎక్కువగా ఉందో.. అప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నిన్నటి మ్యాచ్‌లో షమీ అద్భుతం చేశాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    సినీ హీరోయిన్ భర్తకు సమన్లు

    సినీనటి నమిత భర్త చౌదరికి సెంట్రల్‌ క్రైం బ్రాంచి సమన్లు పంపింది. పరిశ్రమల కౌన్సిల్‌ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది. ఆ పదవికి నమిత భర్త చౌదరి ఇటీవల నియామకమయ్యారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణకు హాజరవ్వాలంటూ సమన్లు పంపారు.

    ఒకే పిక్ లో.. మెగా మనవళ్ళు, మనవరాళ్లు

    నిన్న బాలల దినోత్సవం సందర్భంగా హీరో చిరంజీవి కూతురు శ్రీజ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి పెద్ద కూతురు పిల్లలు, చిన్న కూతురు పిల్లలు, అల్లు అర్జున్ పిల్లలు, ఇంకొంతమంది మెగా ఫ్యామిలీ పిల్లలతో కూడిన ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటోలో చరణ్ కూతురు చిన్ని పాప క్లిన్ కార మిస్ అయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    కర్ణాటక మాజీ సీఎంపై కేసు

    కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర ప్రభుత్యం షాకిచ్చింది. విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదుచేసింది. దీపావళికి బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించేందుకు ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలతో కరెంట్ లాగినందుకు బెస్కాం ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని చెప్పారు.