• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దక్షిణాఫ్రికా ఓటమి.. కెప్టెన్‌పై విమర్శలు

    వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడింది. అప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన సౌతాఫ్రికా సెమీస్ కీలకమైన నాకౌట్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. అయితే సెమీస్‌లో సౌతాఫ్రికా ఓటమికి ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమానే కారణమని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలం, కెప్టెన్సీలో ప్రభావం చూపలేకపోతున్నాడని విమర్శలు చేస్తున్నాయి. దీంతో జట్టుకు భారమయ్యాడని విమర్శిస్తున్నారు.

    కేంద్రానికి ‘అల్టిమేటం’ జారీ చేసిన సీఎం

    కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అల్టిమేటం జారీ చేశారు. బిహార్‌కు త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కేంద్రంపై వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలమూలన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తుందని పేర్కొన్నారు.

    అప్పులు తప్ప అభివృద్ధి లేదు: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. పేదలకు గృహాలు, సంక్షేమ పథకాలను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందని తెలిపారు. ఆ నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ వైసీపీ గొప్పలకు పోతుందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు మంజూరు చేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    పవన్‌ది నాది ఒకే మనస్తత్వం: బాలకృష్ణ

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది.. తనది ఒకే మనస్తత్వమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇద్దం ముక్కుసూటిగా మాట్లాడే అలవాలు ఉందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

    ఓటీటీకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరావు’

    టాలివుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. తెలుగుతో పాటు తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో టైగర్‌ నాగేశ్వరరావు స్ట్రీమింగ్ అవుతోంది. మొదట నవంబర్‌ 27న ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే వారం ముందుగానే ఈ పాన్‌ ఇండియా మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేశారు.

    తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

    AP; బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెప్పంది. తుపానుగా మారితే ‘మిధిలి’గా నామకరణం చేయనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశముందని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక అత్యాచారం

    ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. సిగరెట్లతో వాతలు పెట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఇంట్లోకి ఐదుగురు దుండగులు రాత్రి సమయంలో పక్కింటి పై కప్పు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. మహిళకు మత్తుముందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం వారు ఆమె కాళ్లు చేతులు కట్టేసి సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక అత్యాచారం చేశారు.

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్‌

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు నేడు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యప్రదేశ్‌లో ఎస్టీ రిజర్వుడు సీట్లు 47, ఎస్సీ రిజర్వుడు 35 ఉన్నాయి. ఛతీస్‌గఢ్‌లో ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది.

    జిన్‌పింగ్ నియంతే: బైడెన్

    చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత బయటకు వచ్చిన బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘జిన్‌పింగ్‌ను నేనింకా నియంతగానే విశ్వసిస్తున్నా.. చైనా ప్రభుత్వ పాలకు మా ప్రభుత్వ పాలనకు చాలా తేడా ఉంది’. అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    BRSకు 100 సీట్లు గ్యారంటీ: కవిత

    TS: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని ఆశించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుట్లలో తమ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఈ పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు.