• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRSకు అంతం పలికే రోజు వచ్చింది: రాహుల్

    బీఆర్‌ఎస్‌‌కు అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. పినపాక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని తాను స్వయంగా చూసానని చెప్పారు. ఆ ప్రాజెక్టుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ కేవలం కేసీఆర్‌ ఇంట్లోమాత్రమే వస్తుందని రాహుల్ ఎద్దేవా చేశారు.

    ఆ ప్రచారాన్ని నేను పట్టించుకోను: అలియా

    ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌షోలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, అలియా భట్‌ హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అలియా ఓ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. గతంలో నేను కొవ్వు తగ్గించుకొని సన్నగా మారడానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు. అలాగే నా వైవాహిక జీవితంలోనూ సమస్యలున్నాయంటూ రకరకాల రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. వాటిని నేను పట్టించుకోను’. అని అలియా చెప్పుకొచ్చింది.

    హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు

    తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదైంది. గూడూరులో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కొందరు మహిళలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ క్రమంలో సత్యవతి హారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టీ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

    కుమార్తెకు ఉరివేసి.. దంపతుల ఆత్మహత్య

    హైదరాబాద్ నగరం ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్‌బాబు, చిత్రలేఖ వారి కుమార్తె తేజస్విగా పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిది కర్నూలు జిల్లా లక్ష్మీపురమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ‘ఓటర్ల లిస్ట్‌ కంటే అక్రమ కేసుల లిస్టే పెద్దది’

    ఏపీలో ఓటర్ల లిస్ట్‌ కంటే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నించినందుకు ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తమ పార్టీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్నాడు సవాల్ విసిరారు.

    మరో ఆరు హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజా మేనిఫెస్టోలో 1) తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు ₹25వేల పింఛను, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 2) ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం, 3) రైతులకు ఏకకాలంలో ₹2లక్షల పంట రుణమాఫీ, 4) రైతులకు ₹3లక్షల వడ్డీ లేని రుణాలు, ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్‌, 5) వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ₹2లక్షల ఉద్యోగాల భర్తీ, 6) ఆడపిల్లల పెళ్లికి ₹లక్షతో … Read more

    విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!

    దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో నిన్న గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు. మంగళవారం 397, సోమవారం 358, ఇలా రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోంది. దీపావళి వేడుకలు పరిస్థితులు మరింత తీవ్రతరం చేశాయి.

    ఈ సారి వరల్డ్‌ కప్‌ మనదే: రజనీకాంత్‌

    వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా సెమీఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ బ్యాటింగ్ అప్పుడూ మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది. ఈసారి ప్రపంచకప్‌ వందశాతం భారత్‌కే వస్తుంది’ అని రజనీ చెప్పుకొచ్చారు. అలాగే సెమీఫైనల్స్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లీ, షమీలకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు.

    వేశ్యతో రూమ్ షేర్ చేసుకుని మోసపోయాడు

    HYD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. తనతో పాటు రూమ్ షేర్ చేసుకుంటున్న సదరు మహిళ వేశ్య అని తెలియడంతో రూమ్ ఖాళీ చేయమని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి లైంగిక దాడి చేశాడని ఉద్యోగిపై కేసు పెట్టింది. అంతటితో ఆగకుండా సన్నితంగా ఉన్న ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించి రూ.4.7లక్షలు తీసుకుంది. అయినా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఉద్యోగి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కోపంతో రాత్రి పూట ఇద్దరు వ్యక్తులతో ఉద్యోగిపై … Read more

    100 థియేటర్లలో ‘లియో’ రీ రిలీజ్

    అక్టోబర్ 19న విడుదలైన ‘లియో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజా అప్డేట్ వినిపిస్తుంది. ‘లియో’ని తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్‌లలో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. థియోటర్లలో మంచి సినిమాలు ఏమీ లేకపోవడంతో వసూళ్లను మరింత పెంచేందుకు ‘లియో’ థియోటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు.