• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి

    HYD: సికింద్రాబాద్‌ జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్‌ బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సోదరుడికి తోడుగా స్కూల్‌ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్యను. ప్రమాదవశాత్తు వాహనం ముందు చక్రాల కిందపడి మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసునమోదు చేశారు.

    విజయశాంతికి కాంగ్రెస్ కొత్త బాధ్యతలు

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీజేపీని వీడి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. అందులో15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, తదితరులను నియమించింది.

    కొత్త రూపంలో కోవిడ్‌-19 వ్యాప్తి

    కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను మార్చుకుంటుంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలో వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

    ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, రిచర్డ్‌ మార్లెస్‌

    రేపు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తున్నారు. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్‌ ఎయిరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయనుంది. టాస్‌కు ముందు ముంబయికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. స్టేడియంలో లక్షా 30 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

    టీ20లకు కెప్టెన్‌గా సూర్య?

    ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్‌ పాండ్య కోలుకోకపోవడంతో సూర్యకు పగ్గాలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ ఈనెల 23న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది.

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

    గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసునమోదైంది. అఫ్జల్‌గంజ్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం లేపాయి. ఈనేపథ్యంలో రాజాసింగ్‌పై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. రాజకీయంగా తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాలని రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

    శబరిమలకు పోటెత్తిన భక్తులు

    కేరళలోని శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి, స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు పోటెత్తారు. రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. దర్శనం కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక నుంచి వేల మంది భక్తులు తరలివచ్చారు. రెండు నెలల పాటు కొనసాగే మణికంఠుడి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    అమితాబ్‌.. ఫైనల్‌ మ్యాచ్ చూడొద్దు!

    ప్రపంచకప్‌ ఫైనల్లో రేపు ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాభ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కివీస్‌పై టీమిండియా విజయం తర్వాత ట్విట్టర్ వేదికగా ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘దయచేసి మీరు ఫైనల్‌ చూడొద్దంటూ’ అభిమానులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన అమితాబ్‌.. ‘‘ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా’’ అని మరోసారి ట్వీట్ చేశారు. Screengrab Instagram: amitabh bachchan Screengrab Instagram: amitabh bachchan … Read more

    వ్యాన్‌ లోయలో పడి 8 మంది మృతి

    ఉత్తరాఖండ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ లోయలో పడి 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా స్థానికులేనని తెలుస్తోంది. మృతుల్లో భార్యభర్తతో పాటు వాళ్ల కుమారుడు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఉండదు: KCR

    ధరణి పోర్టల్‌తో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దందాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం ధరణిని వినియోగిస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయంలో రాష్ట్రం 19-20 స్థానాల్లో ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తర్వాత 3.18లక్షల తలసరి ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు.