• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్ బౌలర్లతో జాగ్రత్త: పాక్ మాజీ క్రికెటర్

    భారత్ బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని పాక్ మాజీ స్పిన్నర్ ఇతిఖాబ్ అలామ్ సూచించాడు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. వారిలో కుల్‌దీప్ మరింత ప్రమాదకరమని పేర్కొన్నాడు. ఇది ఆసియా కప్‌లో భారత్ ఆడిన తీరును చూస్తే అర్థమవుతుందన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్పిన్‌ ఎటాక్ చాలా బాగుందని. తప్పకుండా వరల్డ్‌ కప్‌లోనూ ఇదే ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తారని ఇతిఖాబ్ అభిప్రాయపడ్డాడు.

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలని నిర్ణయించింది. తప్పుడు అఫిడవిట్లు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వృద్దులు, 40శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సన్నద్దతపై ఈసీ సమీక్షిస్తోంది.

    అతడి బౌలింగ్ కఠినమైనది: రోహిత్

    దక్షిణాఫ్రికాకు చెందిన డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ కఠినమైనదని రోహిత్ అన్నాడు. అతడి బౌలింగ్‌ సవాల్‌ విసురుతుందని తెలిపాడు. ‘నాకు ఏ బౌలరైనా సవాల్‌ విసిరాడంటే అది డేల్‌ స్టెయిన్‌ మాత్రమే. అతడి బౌలింగ్‌ నైపుణ్యాలు అద్భుతం. ]ఫాస్ట్‌ బౌలింగ్‌లో స్వింగ్‌ చేయగల సమర్థుడు. వేగంతో బంతిని విసిరి కూడా స్వింగ్‌ రాబట్టగల అతికొద్దీమంది బౌలర్లలో స్టెయిన్‌ ఉంటాడు. నిలకడగా అదే స్పీడ్‌తో బంతులను సంధిస్తాడు’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితం

    సినీ ప్రేక్షకులకు ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ చిత్ర బృందం ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితమని వెల్లడించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిపింది. ఆది, సోమవారం మాత్రమే ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని చెప్పింది. బుక్‌ మై షో, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్‌ వెబ్‌సైట్లు/యాప్‌ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది. భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. **

    Video: నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు

    బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోయింది. రోడ్డు మీద కాలిపోతున్న ఎలక్ట్రిక్ కారుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎ ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఎంజి కామెట్ కారు మాదిరిగా ఉందని చెబుతున్నారు. కానీ చాలామంది ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కారు అని కామెంట్లు పెడుతున్నారు. #Bengaluru: An #electric #car caught … Read more

    గిల్‌పై యువరాజ్ ప్రశంసలు

    శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ ఆడగాడు గిల్ అని కొనియాడాడు. ‘అతడి సత్తాను బ్యాటింగ్ గణాంకాలే చెబుతాయి. గిల్ ఆటతీరు ,చూస్తుంటే ముచ్చటేస్తుంది. గత నాలుగైదు ఏళ్లుగా అతడి ఆలోచనా దృక్పథం అత్యున్నత స్థాయిలో ఉంది. గిల్ కేవలం భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి మైదానాల్లో భారీగా పరుగులు చేయగలడు’ అని యువీ తెలిపాడు.

    రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    జమ్మూ కశ్మీర్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా కొకైన్‌ను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన 30 కిలోల కొకైన్‌ విలువ రూ.300 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని బేనీహాల్‌ వద్ద రాత్రి ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా అందులో భారీగా డ్రగ్స్‌ బయటపడింది.

    ‘చంద్రముఖి 2’ కోసం లారెన్స్ భారీ రెమ్యునరేషన్!

    హీరో రాఘవా లారెన్స్ నటించిన చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు లారెన్స్ రెమ్యునరేష్ హాట్ టాపిగా మారింది. ఈ చిత్రం కోసం లారెన్స్‌కి లైకా నిర్మాణ సంస్థ దాదాపు రూ. 25 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారట?

    ఆదిత్య ఎల్‌1 కీలక మైలు రాయి

    సూర్యుడిపై ప్రయోగించిన ‘ఆదిత్య- ఎల్ 1 మరో మైలురాయిని చేరుకుంది. భూమి నుంచి ఈ వ్యౌమనౌక 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించింది. తాజాగా ISRO ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు పేర్కొంది. ఈ వ్యౌమనౌక భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో తెలిపింది.

    Video: ఆడీలో వచ్చి పంటను విక్రయించిన రైతు

    ఓ రైతు ఆడీ కారులో వచ్చి తన పంటను అమ్మడం నెట్టింట వైరల్‌గా మారింది. కేరళకు చెందిన సుజిత్‌, వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఆడీ కారులో వచ్చి తన పంటను విక్రయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాను పండించిన బచ్చలికూర పంటను కోయడం మొదలు విక్రయించడం వరకు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఎనిమిది మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు సుజిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. … Read more