• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌ను నడిపేది దేశ వ్యతిరేక శక్తులు: మోదీ

    ఛత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ ఫైరయ్యారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు అధికంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను నడుపుతోంది ఆ పార్టీ నేతలు కాదని దేశ వ్యతిరేక శక్తులతో అనుబంధం ఉన్నవారు నడుపుతున్నారని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో గతంలో బీజేపీ ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్యశాఖ ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.

    శ్రుతి హాసన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

    స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ నటించిన ‘ది ఐ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్స్‌’కు బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ విభాగంలో నామినేట్‌ అయింది. కోర్ఫు దీవుల్లో పర్యావరణ హితంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. డాప్నే ష్మోన్‌ దర్శకత్వంలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

    మణిపూర్ ఘటన.. అదుపులో నిందితులు

    మణిపూర్‌లో కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మూడు నెలల క్రితం మణిపూర్ అల్లర్లలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో ఆ రాష్ట్రం భగ్గుమంది. ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపైకి నిరసనలు తెలిపారు. దీనిపై దర్యప్తు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    భార్యను చంపి..భర్త ఆత్మహత్య

    HYD: రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. భార్య, కుమారుడిని చంపిన మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలల కిందట భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేసి భర్త ధన్‌రాజ్ హతమార్చాడు. తర్వాత 3నెలల పసికందును చంపేశాడు. ఈ కేసులో ధన్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిప్‌పై ధన్‌రాజ్ విడుదలైయ్యాడు. ఈ క్రమంలో భార్య, బిడ్డను చంపానని మనస్తాపానికి గురైన ధన్‌రాజ్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    రోహిత్ ఫామ్‌లో ఉంటే కష్టమే: పాక్ వైస్ కెప్టెన్

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టమే అని పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అన్నారు. అలాగే బౌలర్లలో కుల్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. హైదరాబాద్ ఆతిథ్యం తమ జట్టుకు ఎంతో నచ్చిందన్నారు. తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. భారత జట్టు గెలుపుకు అత్యుత్తమైన బౌలింగ్ ప్రదర్శన దోహదపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఉప్పల్ మైదానంలో పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.

    ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్..

    ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని TSRTC ఎండీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

    నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, 7మంది మృతి

    స్పెయిన్‌లోని మర్సియాలో ఓ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలుగురికి తీవ్ర గాయాలైయ్యారు. క్షెతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్రిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది. క్లబ్‌లో చిక్కుకుపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. స్పృహ కోల్పోయిన మరికొందరిని బయటకు తెచ్చి ఆస్పత్రికి తరలించారు. Update: The number of deaths at the Teatre nightclub in Murcia, Spain has risen to 11. The Murcia City Council decrees … Read more

    టీడీపీ-జనసేనదే అధికారం: పవన్

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ‘ డీఎస్‌సీ కోరుకుంటున్న నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ‘యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్‌ అంటున్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం’’ అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

    ఆ విషయంలో నా తల్లి బాధపడింది: హన్సిక

    స్టార్ హీరోయిన్ హన్సిక తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. హీరోయిన్‌గా తర్వగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంజెక్షన్స్ తీసుకున్నానని రూమర్లు వచ్చాయని తెలిపింది, దీనిపై తన తల్లి చాలా బాధపడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను ఇలాంటి రూమర్స్ పట్టించుకోలేదు. కానీ మా అమ్మ మాత్రం చాలా బాధపడింది. ప్రశంసలు వచ్చినప్పుడు నేను తీసుకున్నా. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటా’ అని హన్సిక చెప్పుకొచ్చింది.

    యూజర్లను కోల్పోతున్న ‘ఎక్స్’

    ఎక్స్ (ట్విట్టర్) ఈసీఓ లిండా యాకారివో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్స్’ తన యాక్టీవ్ యూజర్లను కోల్పోతుందని తెలిపారు. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్ 11.6 శాతం యూజర్లను కోల్పోయిందని వెల్లడించారు. ప్రస్తుతం తమకు 225 మిలియన్ల రోజువారి యూజర్లు, 550 మిలియన్ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎడాదిలో ఎక్స్ లాభాల బాట పట్టనుందని లిండా చెప్పుకొచ్చారు.