• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుప్రీంకోర్టులో రేవంత్‌కు భంగపాటు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయడంతో రేవంత్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు.

    WarmUp: భారత్‌- నెదర్లాండ్స్ మ్యాచ్ రద్దు

    భారత్‌- నెదర్లాండ్స్ వార్మప్‌ మ్యాచ్‌ రద్దయింది. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. ఇప్పటికే సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌.. భారత్‌, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అలాగే నేడు టీమిండియా, నెదర్లాండ్స్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌కు కూడా వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ్టితో వార్మప్‌ మ్యాచ్‌లు ముగిసాయి. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

    ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. చంద్రబాబుపై కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ నమోదు చేసిందని లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

    మోదీ స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం: KTR

    జనగర్జన సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే ఎన్నుకుంటారని చెప్పారు. ‘ఎన్డీయేలో చేరేందుకు మాకు పిచ్చికుక్క కరిచిందా? సభలో మోదీ పచ్చి అబద్దాలు చెప్పారు. మునిగిపోయో నావలో ఎవరూ ఎక్కాలనుకోరు. నేను సీఎం కావడానికి మోదీ పర్మీషన్ అవసరం లేదు’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

    World Cup 2023: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?

    ఈ సారి వరల్డ్‌కప్‌కు ప్రకటనల ఆదాయం భారీగా పెరుగుతుందన్న అంచాలు నెలకొన్నాయి. ఈ కప్, దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ప్రపంచకప్‌లో కంటే ఈ సారి రెట్టింపు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగుతాయని యాడ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయితే 2019 వరల్డ్‌కప్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయం రూ.400-500 కోట్ల లోపే ఉంది. ఈ సారి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడి నందున ఆదాయం … Read more

    కేసీఆర్ ఎన్డీయేలో చేరుతామన్నారు: మోదీ

    నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ఎన్టీయేలో చేరుతామని తనను ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు. అయితే తాము బీఆర్‌ఎస్‌తో పొత్తును తిరస్కరించామని చెప్పారు. GHMC ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్ర సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందని మోదీ విమర్శించారు.

    TS: బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల

    రాబోయో ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు బీఎస్పీ సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీబీఎస్పీ అధ్యక్షుడు R.S ప్రవీణ్ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. జహీరాబాద్ నుంచి సంగం గోపి, పెద్దపల్లి నుంచి దాసరి ఉషా, తాండూరు నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్, ఇలా మరో 15 మంది పేర్లను బీఎస్పీ ప్రకటించింది. … Read more

    లోకేష్ సీఐడీ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత లోకేష్ సీఐడీ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం లోకేష్ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

    రైతుల త్యాగాలు వృథా కావు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అడ్డదారిలో వెళ్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం జరిగితీరుతుందన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

    వేదికపై కన్నీటి పర్యంతమైన ‘సిద్దార్థ్’

    ‘చిన్నా’ మూమీ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో హీరో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. ‘చిన్నా’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని ప్రయత్నిస్తే తన సినిమాలు ఎవరు చూస్తారని చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా సినిమాలు తెలుగులో ఎవరూ తీసుకోలేదు, చివరకు ఏషీయన్ సునీల్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రీబ్యూట్ చేశారు. వాళ్లకు చాలా థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అడిగే సమయం వచ్చింది. ‘నా పేరు సిద్ధార్థ్ నేను ‘చిన్నా’ అనే సినిమా తీశాను మీరు తప్పక చూడాలి’ అని సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు.