• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR

    ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రధాని మోదీ మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…?1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు. 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?? మీ మనసు … Read more

    న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్

    న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టయ్యారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు తీసుకున్నాడన్న ఆరోపణలు అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 30చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. ‘న్యూస్‌క్లిక్‌’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్‌ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రబీర్ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు అయనను అరెస్టు చేశారు.

    ప్రియుడు మృతి..ప్రేయసి ఆత్మహత్య

    hyd: గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. నేహా అనే యువతి (19) స్థానికంగా కేఫ్‌లో పనిచేస్తుంది. అదే కేఫ్‌లో పనిచేస్తున్న సహా ఉద్యోగి సల్మాన్‌ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సల్మాన్‌..తన నివాసంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆమె ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

    పాపం కారు గ్యారేజీకి పోతోందన్న భయం: సంజయ్

    మంత్రి కేటీఆర్‌పై మాజీ టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్‌ అయితున్నడు. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు కానీ ఏం ఫాయిదా? తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైంది. వరంగల్‌ డల్లాస్‌ కాలే కనీసం బస్టాండ్‌ కూడా రాలే వరదలు, బురదలు బోనస్ నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే 100 కుటుంబాలు కూడా బాగుపడలే 100 ఏళ్లకు సరిపడా … Read more

    ఏది జరగాలని ఉందో అదే జరిగింది: సంజూ

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో సంజూను శాంసన్ సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటివ్వలేదు. దీనిపై సంజూ స్పందిస్తూ. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది. నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ ట్వీట్ చేశారు. అతడు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

    క్రికెట్‌ ప్రియులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌

    క్రికెట్ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను మొబైల్‌ యాప్‌లో ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది. తాజాగా ఈ సంస్థ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. దీని ద్వారా వర్టికల్‌ మోడ్‌లో (నిలువుగా; 9×14) క్రికెట్‌ను వీక్షించొచ్చు. ఒంటి చేత్తో క్రికెట్‌ ప్రసారాలను ఆనందించొచ్చు. ఈ మోడ్‌లో లైవ్‌ ఫీడ్‌ ట్యాబ్‌, స్కోర్‌ కార్డు ట్యాబ్‌ కూడా కనిపిస్తాయి. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు డస్నీ తెలిపింది.

    బీజేపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన

    జనసేనతో పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుపై పవన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని చెప్పారు. పవన్‌ అభిప్రాయంపై వెంటనే స్పందించలేమన్నారు. పవన్ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని పురందేశ్వరి పేర్కొన్నారు.

    వైసీపీకి 15 సీట్లు కూడా రావు: పవన్

    వారాహీ యాత్రలో సీఎం జగన్‌పై పవన్ నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నిల్లో వైసీపీకి 175 సిట్లు కాదుకదా 15 సీట్లు కూడా రావు.. జగన్ పాలనలో విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి హిట్లర్‌ పరిస్థితిలా ఉంది.’ అని పవన్‌ విమర్శించారు.

    సితార మంచి మనసుకు ఫిదా!

    హీరో మహేష్‌బాబు కూతురు సితార మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా సితార హైదరాబాద్‌ ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్‌ పైకి ఎక్కడానికి ఇబ్బంది పడింది. ఇది సితార గమనించి వెంటనే స్టేజ్‌ పై నుంచి దిగొచ్చి ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటినజన్లు … Read more

    యాడ్ వివాదంలో ‘అమితాబ్’

    బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ యాడ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ యాడ్ వివాదాస్పదమైంది. దీనిపై వ్యాపార సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరితంగా ఉన్న ఈ యాడ్ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని అమితాబ్‌కు లేఖ రాసింది. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేలా ప్రకటన ఉందని లేఖలో పేర్కొంది. దుకాణదారుల వద్ద డీల్‌లు, ఆఫర్లు అందుబాటులో లేవని చెప్పడం కస్టమర్లను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే అవుతుందని చెప్పింది. ఈ మాటలకు అమితాబ్ వివరణ ఇవ్వాలని కోరింది.