• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSRTC ఉద్యోగులకు శుభవార్త

    TSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు TSRTC పేర్కొంది. గతంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు పేర్కొంది. ఇటీవలే TSRTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించిన విషయం తెలిసిందే.

    TS: ఓటర్ల జాబితా ఇదే!

    తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఓటర్లలో పురుష ఓటర్లు – 1,58,71,493, మహిళా ఓటర్లు – 1,58,43,339, కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు, తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 2,557, ఓటర్లు మొత్తం ఓటర్లు – 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

    బాలీవుడ్‌ నటుడుకి ఈడీ సమన్లు

    బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఓ ఆన్‌లైన్‌ గేమింగ్‌ మనీలాండరింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు రణ్‌బీర్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆ బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న ఓ భారీ కుంభకోణాన్ని ఇటీవల ఈడీ బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ యాప్‌కు ప్రచారకర్తగా ఉన్న రణ్‌బీర్‌‌ను ఈ నెల 6న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.

    రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ‘హీరోయిన్’

    రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ నటి గాయత్రీ జోషి తీవ్రంగా గాయపడ్డారు. సరదాగా గడిపేందుకు గాయత్రీ ఆమె భర్తతో కలిసి ఇటలీకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో గాయత్రీ, ఆమె భర్త ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారు, వ్యాన్‌ను ఢీకొంది. దీంతో ఫెరారీ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఇద్దరు దంపతులు మరణించారు. గాయత్రీ ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.

    పెళ్లి వేడుకలో విషాదం.. 100 మంది మృతి

    ఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లోని నినేవేహ్ ప్రావిన్స్‌లోని హయ్‌దానియా ప్రాంతంలో ఓ ఫంక్షన్ హల్‌లో వధూవరులు నృత్యం చేస్తున్నారు. ఇంతలో ఫంక్షన్ హాల్ పైభాగంలో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో అక్కడున్న వారు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఘటనలో మొత్తం 114 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WATCH: Extremely terrifying footage of … Read more

    సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి?

    రామాయణాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో సీత పాత్ర కోసం ముందుగా అలియా భట్‌‌ను ఎంచుకున్నారట, ఇందుకోసం ఆమెకు లుక్ టెస్ట్ కూడా చేశారని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయిపల్లవి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె అయితేనే సీత పాత్రకు న్యాయం చేయగలదని మేకర్స్ ఆమెను సంప్రదించారట. త్వరలోనే ఆమెకు లుక్ టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు APSRTC స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

    అనుకున్నదేదీ వెంటనే జరిగిపోదు: రోహిత్ శర్మ

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కెప్టెన్‌ అవకాశం 26 లేదా 27 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘జీవితంలో అనుకున్నదేది వెంటనే జరిగిపోదు. జట్టులో చాలా మంది విన్నర్లుగా ఉన్నా వారి కెప్టెన్సీ అవకాశం అందలేదు. గతంలో గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడారు. కానీ వారు ఎప్పుడూ కెప్టెన్సీ చేపట్టలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అదెంతో ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    శరణార్థులు దేశం విడిచి వెళ్లిపోండి: పాకిస్థాన్

    పాకిస్థాన్ శరణార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్ నుంచి శరణు కోరి వచ్చినవారు తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘ఆఫ్గాన్ నుంచి 2021లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత అనేక మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. దాదాపు 13 లక్షల మంది ఆఫ్గాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. వీరితో పాటు మరో 17 లక్షల మంది దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరంతా నవంబర్ 1వ తేదీ నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలి’ … Read more

    ‘కేర్ టేకర్’కు రూ.80లక్షలు జీతం?

    అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వ రేసులో ఉన్న వికేక్ రామస్వామిపై ఓ వార్త వైరల్ అవుతోంది. తన పల్లల సంరక్షణ కోసం కేర్‌ టేకర్ కోసం వెతుకుతున్నారట. ఇందుకోసం సంరక్షకురాలికి ఏడాదికి లక్ష డాలర్లు ‘రూ.80లక్షలు’ జీతం ఇవ్వనున్నట్లు సమాచారం, ‘వారంలో 96 గంటలు పనిచేయాలి. తదుపరి వారం మొత్తం సెలవు ఉంటుంది. ఇంట్లో ఉంటూ చిన్నారులను కనిపెట్టుకుని ఉండాలి’ అని ఎస్టేట్ జాబ్స్‌కామ్ అనే పోర్టల్‌లో ఈ ప్రకటన వచ్చింది. ఇది రామస్వామి ప్రకటనే అన్న అభిప్రాయాలు నెలకొన్నాయి.