ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుందని పేర్కొంది. ఆయా శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.