• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రకృతి ఒడిలో పరవశం

    ఉన్నత చదువులు, సంసన్న జీవితం అనుభవించినప్పటికీ.. జీవిత పరమార్ధం ఇది కాదని కొందరు భావించారు. ఈ అన్వేషణలో భాగంగా అలాంటి వారందరూ కలసి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా హిర మండల పరిధిలో కూర్మ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో 56 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడుతారు. ఈ గ్రామంలో విద్యుత్ ఉండదు. ప్రకృతి నుంచే కూడు, గుడ్డ, గూడు పొందుతున్నారు. వీరు ఆథ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.

    క్రికెట్‌లోకి సెహ్వాగ్ తనయుడి ఎంట్రీ

    భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ దేశవాళీ క్రికెట్‌లో [ఆరంగేట్రం](url) చేయనున్నాడు. 15 మందితో కూడిన ఢిల్లీ అండర్-16 జట్టుకు సెలక్టర్లు ఆర్యవీర్‌ను ఎంపిక చేశారు. విజయ్ మర్ఛంట్ ట్రోపీ కోసం అతడిని సెలెక్ట్ చేశారు. బీహార్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆర్యవీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్యవీర్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని, అందుకే అతడిని ఎంపిక చేశామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఆకాశ్ మల్హోత్రా పేర్కొన్నారు. View this post on Instagram A post … Read more

    శిఖర్ ధావన్ బర్త్‌డే వేడుకలు; వీడియో వైరల్

    టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఢాకాలో కోచ్ రాహుల్ ద్రావిడ్, సహచరులతో కలసి కేక్ కట్ చేసి బర్త్‌డే నిర్వహించుకున్నాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం ధావన్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ధావన్ భారత వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. View this post on Instagram … Read more

    సైనికుడి పిల్లలతో రామ్ చరణ్ సెల్ఫీ; వీడియో వైరల్

    గాల్వాన్ ఘటనలో అమరుడైన సంతోష్ ‌బాబు పిల్లలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. తాజాగా రామ్ చరణ్ ఓ వార్తా సంస్థ నుంచి ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నారు. సంతోష్ బాబు కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలు చరణ్‌తో ఫొటో దిగటానికి ఆసక్తి చూపారు. చరణ్ స్వయంగా వారి ఫోన్ తీసుకుని సెల్పీ తీశాడు. దీంతో నెటిజన్లు రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అని అంటున్నారు. . … Read more

    ఫ్యాన్స్ కాళ్లు మొక్కిన స్టార్ హీరో

    బాలీవుడ్ స్టార్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ ఓ అభిమాని కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబందించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ‘వేద్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఓ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఓ యువతి రితేష్‌తో డ్యాన్స్ చేసింది. ఆ ఆనందం పట్టలేక అతడి కాళ్లు పట్టుకుంది. ఇంతలా అభిమానం చూపించిన ఆ యువతిని హగ్ చేసుకుని, ఆమె కాళ్లు పట్టుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వేద్’ చిత్రం డిసెంబర్ 30న విడుదల కానుంది. … Read more

    రొనాల్డో కోసం ఏదైనా చేస్తా; గోల్ఫ్ క్రీడాకారిణి స్పిరానక్

    ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోసం ఏదైనా చేస్తానని అమెరికా మాజీ గోల్ఫ్ క్రీడాకారిణి పెయిజ్ స్పిరానక్ అంటోంది. ఆమె రొనాల్డోకు, ముఖ్యంగా అతని ‘సుయ్’కు వీరాభిమాని. రొనాల్డో ‘సుయ్’ను స్పిరానక్ కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది. బంతిని గోల్ పోస్ట్‌లోకి తన్ని.. తాను వేసుకున్న టాప్ తొలగించి సంబరాలు చేసుకుంది. అనంతరం మోకాళ్లపై కూర్చుని ‘లవ్ యూ రొనాల్డో’ అంటూ వయ్యారాలు పోయింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. .@PaigeSpiranac here to give us her best Brandi … Read more

    వెంకటేష్ కుమార్తెతో చైతూ వంట కబుర్లు

    నటుడు వెంకటేశ్ కుమార్తె అశ్రిత తన యూట్యూబ్ ఛానల్ ‘ఇన్ఫినిటీ ఫ్లాటర్’లో కొత్త వంటలను పరిచయం చేస్తుంటారు. ఈ క్రమంలో తన బావ, యంగ్ హీరో నాగచైతన్యకు చెందిన క్లౌడ్ కిచెన్‌లో ఆమె సందడి చేశారు. అక్కడ తయారయ్యే ఫుడ్ గురించి చైతూను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశ్రితకు చైతూ అక్కడి ఫుడ్ టేస్ట్ చూపించాడు. అక్కడి వంటకాలకు అశ్రిత ఫిదా అయిపోయారు. కాగా వీడియోలో ‘మై బావ’ అంటూ చైతూను పిలవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

    ఆలయంలో మహిళల డ్యాన్స్ .. ఊడిన ఉద్యోగం

    ఆలయంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న మహాకాళి ఆలయంలో జరిగింది. దేవాలయంలో పనిచేసే ఇద్దరు మహిళా సిబ్బంది బాలీవుడ్ పాటకు డ్యాన్స్ వేశారు. ఆసమయంలో గుడిలో భక్తుల రద్దీ అంతగా లేదు. ఈ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. దీంతో వారిపై భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ విషయం దేవస్థాన అధికారులకు తెలియడంతో వారిని విధుల నుంచి తొలగించారు. #WATCH उज्जैन के महाकाल मंदिर में एक … Read more

    బస్టాప్‌లోకి దూసుకెళ్లిన లారీ; ఆరుగురు దుర్మరణం

    ప్రమాదవశాత్తు ఓ లారీ బస్టాప్‌లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సత్రుండా చౌరస్తా వద్ద ఓ లారీ వేగంగా వచ్చి బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న వారిలో 6 మంది మరణించగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్ పరారీ కాగా లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. #NDTVBeeps | On Camera, Truck Rams People At … Read more

    ట్విన్ సిస్టర్స్‌ను పెళ్లాడిన వ్యక్తి; కేసు నమోదు

    మహరాష్ట్రలోని షోలాపూర్‌లో ట్విన్ సిస్టర్స్ ఒకే వ్యక్తిని పెళ్లాడటం వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీలు అతుల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ కవలలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అతుల్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపులా అంగీకారం తెలపడంతో జరిగింది. కాగా ఈ పెళ్లిపై స్థానిక అక్లూజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. महाराष्ट्र के पंढरपुर में … Read more