ప్రమాదవశాత్తు ఓ లారీ బస్టాప్‌లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో చోటుచేసుకుంది. సత్రుండా చౌరస్తా వద్ద ఓ లారీ వేగంగా వచ్చి బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న వారిలో 6 మంది మరణించగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్ పరారీ కాగా లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.