• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలంక వీరాభిమాని ‘పెర్సీ’ మృతి

    శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని ‘పెర్సీ అబేశేఖర’ (87) ‍కన్నుమూశారు. అనారోగ్యంతో కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా ‘అంకుల్ పెర్సీ’ అని పిలుచుకునేవారు. ఈయన శ్రీలంక మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ వాలిపోయేవారు. 1979 వరల్డ్‌కప్‌ నుంచి 40 ఏళ్లపాటు దాదాపు శ్రీలంక ఆడిన ప్రతీ మ్యాచ్‌ చూసేందుకు పెర్సీ మైదానానికి వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత స్టేడియాల్లో శ్రీలంక జెండాను రెపరెపలాడించారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా పెర్సీ పెద్ద ఫ్యాన్.

    ‘ఎంపీపై దాడితో నాకు సంబంధం లేదు’

    TG: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని పేర్కొన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని గుర్తుచేశారు. దళిత బంధు రాలేదన్న కోపంతోనే నిందితుడు గటాని రాజు ఎంపీపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందనరావు తెలిపారు. రాజు ఫేస్‌బుక్‌ ఖాతాను పరిశీలిస్తే అతనికి కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.

    రష్యా ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం

    రష్యాలోని ఓ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన విమానం దగెస్థాన్‌ విమానాశ్రయంలో ఆగడంతో అక్కడి నిరసనకారులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విమానాన్ని తమ ప్రాంతంలో ల్యాండ్‌ చేయడాన్నివారు తీవ్రంగా తప్పుబట్టారు. అంతేగాక విమానం దిగిన వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. When word spread that a plane from Tel Aviv was … Read more

    81 కోట్ల మంది ఆధార్‌ వివరాలు లీక్‌..!

    దేశ ప్రజల ఆధార్‌ కార్డ్‌ వివరాలు మరోమారు లీకైనట్లు తెలుస్తోంది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్‌ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్‌వెబ్‌లో ఓ ప్రకటన కనిపించింది. దీనిని దేశంలోనే అత్యంత భారీ డాటా చోరీగా పేర్కొంటున్నారు. ICMR వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్‌ దొంగల చేతికి చిక్కినట్టు సమాచారం. ICMR మీద గత ఫిబ్రవరి నుంచే సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. గత 8 నెలల్లో సుమారు ఆరువేల సార్లు ఐసీఎంఆర్‌ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు.

    ప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ

    AP: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన రైలు ప్రమాద ఫొటోలను సీఎం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఘటనాస్థలిని పరిశీలించాలని జగన్ భావించినప్పటికీ ట్రాక్‌ పనురుద్ధరణ పనుల రిత్యా వీలు పడలేదు. దీంతో జగన్‌ నేరుగా ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల్లో స్థైర్యాన్ని నింపారు. #WATCH | Andhra Pradesh CM YS Jagan … Read more

    టీమిండియాకు మరో గుడ్‌ న్యూస్‌

    వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు మరో శుభవార్త అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. నొప్పి నుంచి ఉపశమనం పొంది ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ కూడా ప్రారంభించినట్లు సమాచారం. లీగ్‌ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకొని సెమీస్‌ సమయానికి జట్టుతో హార్దిక్‌ కలుస్తాడని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. హార్దిక్‌ ఇప్పటికే రెండు నెట్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడని పేర్కొన్నాయి. కాగా, నవంబర్‌ 15 నుంచి వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ దశ మెుదలవుతుంది.

    భారాస ఎంపీపై హత్యాయత్నం

    TG: దుబ్బాక భారాస అభ్య‌ర్థి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఓ పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకొచ్చిన ఎంపీకి షేక్ హ్యాండ్‌ ఇస్తానని వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్ర‌భాక‌ర్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి. తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న దౌల్లాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో చోటు చేసుకుంది. మరోవైపు నిందితుడ్ని పట్టుకున్న … Read more

    ‘కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రం నాశనమే’

    HYD: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే భారాస ప్రభుత్వం తిరిగి రావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డిని ఇంటికెళ్లి కలిసిన మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

    తెలంగాణకు రాహుల్‌, ప్రియాంక

    కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. మ. 3 గంటలకు దేవరకద్రకు ఆమె చేరుకుంటారు. సా. 4.30 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు రాహుల్‌ నవంబర్‌ 1, 2 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

    ఆ స్థానాల్లో సా. 4 వరకే పోలింగ్‌: ఈసీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 4 వరకే పోలింగ్‌ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.