• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో కుంభకోణం.. రంగంలోకి ఈడీ

    AP: ట్రాఫిక్‌ ఈ-చలానాల కుంభకోణంపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌తోపాటు అతనికి చెందిన డేటా ఎవాల్వ్‌ సంస్థ, మరికొందరిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారు చెల్లించిన చలానాల సొమ్ము రూ.36.53 కోట్లను అవినాష్‌, తదితరులు కొల్లగొట్టారన్నది ప్రాథమిక అభియోగం. దీనిపై ఏపీ పోలీసులు గతంలోనే కేసు పెట్టగా తాజాగా ఈడీ కూడా దర్యాప్తుకు ఉపక్రమించింది.

    పోలీసుల అదుపులో దస్తగిరి

    AP: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో దర్యాప్తునకు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. యువతిని కారులో కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలపై విచారించనున్నట్లు చెప్పారు. కాగా, వివేకా కేసులో కీలక ముద్దాయిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి కేసు విచారణ సహకరిస్తున్నాడు.

    బుమ్రా అత్యుత్తమ బౌలర్‌: వసీం

    ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌ అని పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. ‘ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బుమ్రా భలే బోల్తా కొట్టించాడు. అతడి లెంగ్తే బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. బుమ్రా బౌలింగ్‌ వేగం, లెంగ్త్‌ అద్భుతం. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడు. ఔట్‌ స్వింగర్లను నా మాదిరే వేస్తున్నాడు. అంతేకాదు కొన్నిసార్లు నన్ను మించిన నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్నాడు’ అని అక్రమ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

    ‘అందుకే వరుణ్‌ పెళ్లికి వెళ్లడం లేదు’

    వరుణ్‌ తేజ్‌ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడం లేదో నటి రేణూ దేశాయ్‌ ఓ ఇంటర్యూలో తెలిపారు. ‘వరుణ్‌ నా ముందే పెరిగాడు. నా ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయి. నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించా. ఒకవేళ వరుణ్‌ పెళ్లికి వెళ్తే అసౌకర్యంగా ఫీలవుతారు’ అని పేర్కొన్నారు. వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబరు 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వరుణ్‌, లావణ్యల కుటుంబాలు, పవన్‌, రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి … Read more

    నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

    AP: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్‌కు సంబంధించి నిన్న (సోమవారం) ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కాగా, చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు పెట్టింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది.

    తిరుమలలో రద్దీ సాధారణం

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా, నిన్న స్వామి వారికి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అటు నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.210, రూ.230 చొప్పున తగ్గింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,200కి చేరింది. అటు ముంబయిలో రూ.57,200, చెన్నైలో రూ. 57,350, కోల్‌కత్తాలో రూ.57,200, బెంగళూరులో రూ.57,200గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200కు తగ్గింది. మరోవైపు కిలో … Read more

    ప్రజలకు ఆ హక్కు లేదు: కేంద్రం

    రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘సరైన వ్యక్తిని ఎన్నుకొనేందుకు అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. కానీ, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే హక్కు వారికి లేదు. రాజ్యాంగపరమైన చట్టం లేనందున ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దాతల వివరాలు గోప్యంగా ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా నేడు పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రధాన రైళ్లయిన హవ్‌డా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హవ్‌డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌- హైదరాబాద్‌ (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖ-గుణుపుర్‌, విశాఖ-రాయగడ, విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిన్న కూడా పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు.

    ‘మ్యాడ్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

    నార్నే నవీన్, సంగీత శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించిన ‘మ్యాడ్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్‌ 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్‌.. థియేటర్లలో పెద్ద సక్సెస్ అయ్యింది. రూ.25 కోట్ల గ్రాస్‌, రూ.12 కోట్ల షేర్‌ను సంపాదించింది. యంగ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.