• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబు బెయిల్‌పై అంబటి సెటైర్లు

    AP: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ లభించడంపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్‌ (X) వేదికగా స్పందించారు. బాబుకు బెయిల్‌ వచ్చింది నిజం గెలిచి కాదని పేర్కొన్నారు. కళ్లు కనిపించడం లేదని కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని ఎద్దేవా చేశారు. స్కిల్‌ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఐదు కండిషన్లు విధిస్తూ నవంబర్‌ 28 వరకు బెయిల్‌ ఇచ్చింది.

    మరో నాలుగు రోజులు ఐసీయూలోనే!

    TG: కత్తి దాడిలో గాయపడ్డ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యంపై హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి వైద్యులు అప్‌డేట్‌ ఇచ్చారు. నాలుగు గంటలపాటు శ్రమించి ఆయనకు ఆపరేషన్‌ చేసినట్లు చెప్పారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనకు ICUలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. మరోవైపు ఈ దాడిని నిరసిస్తూ దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలుపునిచ్చారు BRS కార్యకర్తలు, వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నారు.

    ఓటీటీలో రీరిలీజ్‌ కాబోతున్న ‘మగధీర’!

    రామ్‌చరణ్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘మగధీర’ చిత్రం ఓటీటీ వేదికగా రీ-రిలీజ్‌ కాబోతోంది. ఆహాలో ప్రీమియర్‌ క్వాలిటీతో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. నవంబర్‌ 3 నుంచి నాణ్యమైన వీడియో, ఆడియోతో ఈ మూవీ ప్రసారం కానుంది. ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర్జున్‌, B.V.S. ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. శ్రీహరి, దేవ్‌గిల్‌ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

    చంద్రబాబు బెయిల్‌ షరతులు ఇవే!

    AP: స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ కాపీలో హైకోర్టు పలు షరతులు విధించింది. ‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు అవుతుంది’ అని తీర్పు కాపీలో జస్టిస్‌ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.

    బర్త్‌డే రోజు కోహ్లీ శతకొట్టాలి: రిజ్వాన్

    నవంబర్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. అదే రోజు కోహ్లీ పుట్టినరోజు కావడంతో దీనిపై పాక్ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్‌ స్పందించాడు. విరాట్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఆ రోజు కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. ‘ఈ బర్త్‌ డే కోహ్లీకి మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలి. పుట్టినరోజున 49వ వన్డే సెంచరీని అందుకుంటాడని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 50వ వన్డే సెంచరీ కూడా సాధించాలి’ అని రిజ్వాన్‌ అన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో 48 సెంచరీలతో ఉన్న కోహ్లీ మరో శతకం చేస్తే వన్డేల్లో … Read more

    విజయ్‌ దేవరకొండ మంచి మనసు

    రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మరోమారు తన మంచి మనసు చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారికి రూ. లక్ష సాయం అందించాడు. కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఈ విషయం విజయ్‌ దృష్టికి రాగా ఆర్థిక సాయం చేసేందుకు అతడు ముందుకు వచ్చాడు. విజయ్‌ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయ్‌ ఫాన్స్‌ తమ హీరోని చూస్తుంటే గర్వంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

    చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

    AP: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు నాలుగు వారాల బెయిల్‌ మంజూరు ‌అయ్యింది. ఆయన వేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు ఆమోదించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 24 వరకూ మధ్యంతర బెయిల్ వర్తించనున్నట్లు అందులో పేర్కొన్నారు. తిరిగి నవంబర్ 28న సరెండర్ అవ్వాలని చంద్రబాబును కోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై నవంబర్‌ 10న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

    వికెట్లపై పడ్డ శ్రీలంక కీపర్‌

    శ్రీ‌లంక వికెట్ కీప‌ర్ కుశాల్ మెండిస్ వికెట్ల‌పై ప‌డిపోయాడు. సోమ‌వారం అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అఫ్గ‌న్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో బంతిని అందుకునే క్ర‌మంలో బ్యాలెన్స్ త‌ప్పిన మెండిస్ అమాంతం వికెట్ల‌ను నెట్టుకుంటూ కింద పడ్డాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతిలో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. నాలుగు ఓటములతో ఆరో స్థానానికి పడిపోయింది. https://www.instagram.com/reel/CzB1oc-vufc/?utm_source=ig_web_copy_link

    ఒకే ఫ్యామిలీలోని 9 మంది కాల్చివేత

    ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. దీంట్లో ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన వోల్న‌వాకా ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇళ్లు ఇవ్వ‌లేద‌న్న కోపంతో ర‌ష్యా సైనికులు ఆ కుటుంబాన్ని కాల్చివేసి ఉంటార‌ని ఉక్రెయిన్ ఆరోపించింది. ర‌క్త‌పు మ‌ర‌క‌లు, బుల్లెట్లు దిగిన శ‌రీరాలతో ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘ‌ట‌న ప‌ట్ల రెండు దేశాలు వేర్వురుగా ద‌ర్యాప్తు ప్రారంభించాయి.

    ‘టీమిండియాను ఓడించడం కష్టమే’

    ప్రపంచకప్‌లో టీమిండియా ‌అద్భుతంగా ఆడుతోందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసించాడు. టోర్నీలో ఇప్పటివరకూ ఎటువంటి కఠినమైన పోటీని భారత్‌ ఎదుర్కోలేదని పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్‌పై 230 పరుగులు చేసిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడ్డట్లు అనిపించింది. కానీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో తేలిగ్గా విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా స్వదేశంలో భారత్ బలమైన ప్రత్యర్థిగా ఉంది. సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం ఎప్పుడూ కష్టమే’ అని స్మిత్ అన్నాడు.