• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు కేసులో కీలక మలుపు

    AP: చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మొత్తం 12 మంది ఐఏఎస్‌లను విచారించాలంటూ న్యాయవాది ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెదేపా హయాంలో సిమెన్స్‌ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ఫిర్యాదులో కోరారు. కాంట్రాక్ట్‌, చెక్‌ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదులో సూచించారు.

    ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు

    HYD: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. ఈ ఉదయమే వైద్య పరీక్షల కోసం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం చంద్రబాబు అక్కడే అడ్మిట్‌ అయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయన వైద్యుల సంరక్షణలో ఒకరోజు పాటు ఉండే అవకాశం ఉంది.

    కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్

    TG: కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ‌మైన సంస్కృతి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. క‌త్తుల‌తో దాడులు చేసి భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిర్మ‌ల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘పదేళ్ల భారాస పాలనలో క‌ర్ఫ్యూ లేదు. మ‌త‌క‌ల్లోలం లేదు. కానీ కాంగ్రెస్ నేతలు క‌త్తులు ప‌ట్టి దాడులు చేస్తున్నారు. మొన్న దుబ్బాక అభ్య‌ర్థిని కత్తితో పొడిచారు. దేవుడి ద‌య వ‌ల్ల ప్రాణ‌పాయం త‌ప్పింది. కాంగ్రెస్ పార్టీది ఇంత దుర్మార్గ‌మైన సంస్కృతి’ అని మండిపడ్డారు.

    జగన్‌పై సుప్రీంకు వెళ్లిన వైకాపా ఎంపీ

    AP: సీఎం జగన్‌ కేసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ‘జగన్‌ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేయడంతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ‘సంచలనం కోసమే ఎంపీపై దాడి’

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు.. ఎంపీపై దాడి చేశారని తెలిపారు. ‘నిందితుడికి ఎవరి సహకారం లేదు. రాజు ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం క్రితం కత్తికొనుగోలు చేసి ఎంపీ హత్యకు పథకం రచించాడు. రాజు పలు వెబ్‌ఛానల్స్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. విలేఖరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడు’ అని వివరించారు.

    NZ vs RSA: దక్షిణాఫ్రికా భారీ స్కోరు

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్‌ డీకాక్‌ (114), డస్సెన్‌ (133) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ 53 (30 బంతుల్లో) క్లాసెన్ 15 (7 బంతుల్లో) వేగంగా రన్స్‌ చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ 2 వికెట్లు పడగొట్టగా.. … Read more

    ‘KCR దోచుకున్నదంతా పేదలకు పంచుతాం’

    TG: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపించారు. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు. కేసీఆర్ దొచుకున్నదంతా వసూలు చేసి ప్రజలకు పంచిపెడతామని రాహుల్‌ హామి ఇచ్చారు. రాష్ట్రంలో యుద్ధం మెుదలైందన్న రాహుల్‌.. దీనిని దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

    ‘అదానీ కోసమే ఫోన్ల ట్యాపింగ్‌’

    దేశంలో ప్రతిపక్ష ఎంపీల ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహరంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలకు యాపిల్‌ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కేంద్రంలోని భాజపా ఓర్వలేకపోతోందన్నారు. అందుకే విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు.

    అమరావతికి ర్యాలీగా చంద్రబాబు!

    AP: హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశముంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి ర్యాలీగా వెళ్లనున్నారు. రాజమహేంద్రవరం నుంచి వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం మీదుగా విజయవాడ రానున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుంటారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లనున్నారు.

    ఇటలీలో వరుణ్‌ పెళ్లి సందడి షురూ

    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి రేపు ఇటలీలోని టస్కనీలో వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. అయితే పెళ్లి వేడుకలు నిన్న రాత్రి కాక్‌టేల్‌ పార్టీతో ప్రారంభమయ్యాయి. ఈ పార్టీలో చిరు దంపతులతో పాటు రామ్‌చరణ్‌-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డి తదితరులు పాల్గొని సందడి చేశారు. పార్టీలో పెళ్లి కూతురు లావణ్య వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, నేడు హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Courtesy Twitter:@baraju_SuperHit Courtesy Twitter:@baraju_SuperHit Courtesy Twitter:@baraju_SuperHit … Read more