• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూజిలాండ్‌పై పాక్ విజయం

    వరల్డ్‌కప్‌లో కివీస్‌ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం మ్యాచ్‌కు అటంకం కలిగించడంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం పాక్‌ను విజేతగా ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో పాక్‌ 160/1 (21.3) స్కోరుతో ఉన్నప్పుడు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. తిరిగి మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత 25.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం పడింది. అప్పుడు పాక్‌ స్కోరు 200/1. DLS ప్రకారం 21 పరుగులు ముందుండటంతో అంపైర్లు … Read more

    ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్య

    కేరళకు చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 33 ఏళ్ల రాహుల్ N. కుట్టి కొచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాహుల్ ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని ప్రముఖ ఫుడ్‌ని పరిచయం చేస్తుంటాడు. 2015 నుంచి రాహుల్ ఫుడ్ బ్లాగింగ్‌లో భాగంగా వీడియోలు రూపొందిస్తున్నారు. ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని అండర్ రేటెడ్‌గా ఉన్న ఫుడ్ జాయింట్లను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ పేజీకి 4.21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, రాహుల్‌కు భార్య, రెండేళ్ల … Read more

    చంద్రబాబుతో పవన్‌ కీలక భేటి

    HYD: తెదేపా అధినేత చంద్రబాబును జనసేనాని పవన్‌ కల్యాణ్ హైదరాబాద్‌లో కలిశారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీకి సంబంధించి 10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై నేతలు చర్చించారు.

    NED vs AFG: అప్గాన్‌ ఘన విజయం

    వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌.. 31.3 ఓవర్లలోనే 181/3 స్కోరు చేసి టార్గెట్‌ ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్‌ షా (52), హష్మతుల్లా (56) అర్ధశతకాలతో రాణించారు. అజ్మతుల్లా 31*, ఇబ్రహీం జడ్రాన్‌ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. నెదర్లాండ్ బౌలర్లలో లొగాన్‌, రోలోఫ్, జుల్ఫికర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో ఆఫ్గాన్‌ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

    బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

    తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జడ్జిలను దూషించారన్న అభియోగాలపై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం పలు ఆరోగ్య పరీక్షల కోసం బుద్దా వెంకన్న హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు.. నేరుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు చెప్పారు.

    శ్రీవారిని దర్శించిన పంత్‌, అక్షర్‌

    AP: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఈ ఇద్దరు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాంతో ఆలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    డిసెంబర్ 19న ఐపీఎల్‌ వేలం

    ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్లు, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూను కలిగి ఉండనున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.

    ‘భారతీయుడు 2’ ఇంట్రో అదుర్స్‌..!

    సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ బయటకొచ్చింది. కమల్‌ హాసన్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అవినీతితో విసిగిపోయిన ప్రజలు భారతీయుడు తిరిగి రావాలంటూ నెట్టింట హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం టీజర్‌లో కనిపించింది. చివరకూ కమల్‌ ఎంట్రీతో టీజర్‌ ముగుస్తుంది. #Bharateeyudu2 💥pic.twitter.com/7KJH4JA9EM — OTT Gate (@OTTGate) November 3, 2023

    కాళేశ్వరం ప్రశ్నార్థకమైంది: కిషన్‌ రెడ్డి

    TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫ్లాప్‌ అయ్యిందని రాష్ట్ర భాజపా చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డిలోని రాజారెడ్డి గార్డెన్‌లో ఆయన మాట్లాడారు. రూ.1.20 లక్షలు పెట్టి కేసీఆర్‌ కాళేశ్వరం కడితే అది కుంగిపోతోందని విమర్శించారు. కూలిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చివరకూ కాళేశ్వరమే ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన సీఎంను కామారెడ్డి ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.

    నెదర్లాండ్‌ను చుట్టేసిన అఫ్గాన్‌ స్పిన్నర్లు

    వరల్డ్‌కప్‌లో అఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్‌ 46.3 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయ్యింది. నెదర్లాండ్ బ్యాటర్లలో సైబ్రాండ్‌ (58) అర్ధశతకంతో రాణించాడు. మ్యాక్స్‌ 42, కొలిన్‌ అక్కర్‌మన్‌ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయకపోవడంతో నెదర్లాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అటు అఫ్గాన్‌ బౌలర్లలో నబీ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ అహ్మద్‌ 2, ముజీబుర్‌ రహ్మన్‌ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ విజయానికి 180 పరుగులు అవసరం.