• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    TG: సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు), రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు (ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు) ఉన్నాయని ప్రకటించారు. తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు లేవని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లు అని … Read more

    స్వల్ప స్కోరుకు శ్రీలంక ఆలౌట్‌

    వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ అయ్యింది. 46.4 ఓవర్లలో 171-10 స్కోరు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్‌ పెరీరా (51) అర్ధ శతకంతో రాణించాడు. ఓ దశలో 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన లంకను మహీశ్‌ తీక్షణ (39) ఆదుకున్నాడు. అతడు చివరి వరకూ నాటౌట్‌గా నిలబడటం వల్లే లంక ఈ మాత్రం స్కోరైనా చేయగల్గింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, ఫెర్గూసన్‌ 2, శాంట్నర్‌ 2, రచిన్ రవీంద్ర 2, సౌథీ ఒక వికెట్ … Read more

    హైదరాబాద్‌లో భారీ వర్షం

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, మూసాపేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ వద్ద రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

    కేసీఅర్‌ను ఇంటికి పంపాలి: మోదీ

    తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని బీసీ ఆత్మగౌరవ సభలో అన్నారు. ‘తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వాటితోనే భారాస మోసం చేసింది. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే’ అని మోదీ అన్నారు.

    ఆ మూడు పార్టీలు ఒకటే: కిషన్‌రెడ్డి

    TG: భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకటేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని, తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, భారాస కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనన్నారు.

    సీఎం కేసీఆర్‌కు పవన్‌ చురకలు

    TG: సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు. నాలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ’ అని పవన్‌ అన్నారు.

    రిజర్వేషన్లపై బిహార్‌ కీలక నిర్ణయం

    రిజర్వేషన్లకు సంబంధించి బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలు కలిపి 30శాతం ఉండగా.. తాజా పెంపుతో అవి 43శాతం కానున్నాయి. మరోవైపు ఎస్టీలకు 2 శాతాన్ని ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి.

    డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు: కేసీఆర్‌

    TG: డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని భారాస అధినేత కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. చెన్నూరు సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణ రాకముందు.. వచ్చాక.. రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని ప్రజలు గమనించాలి.. ఆలోచించాలి. ఆ తర్వాతనే ఓటు వేయాలి’ అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

    Rashmika Fake Video: నెట్టింట రష్మిక బోల్డ్‌ వీడియో వైరల్‌.. మండిపడ్డ కేంద్రం, అమితాబ్‌ బచ్చన్‌!

    సినీ ఇండస్ట్రీలో అత్యంత ఫ్యాన్‌ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో రష్మిక (Rashmika) ఒకటి. ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన పోస్టులను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. ఈ భామ పెట్టే ఏ చిన్న ఫోటో అయినా నిమిషాల వ్యవధిలో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.  రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ ఫేక్‌ … Read more

    BAN vs SL: బంగ్లాదేశ్‌ టార్గెట్‌ ఫిక్స్‌

    వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక మంచి స్కోరు చేసింది. 49.3 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 279 రన్స్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక సెంచరీ (108)తో చెలరేగాడు. వికెట్లు పడుతున్న నిలకడగా ఆడి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక 41, సమరవిక్రమ 41, ధనంజయ 34 రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజీన్‌ హసన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ 2, షోరిఫుల్‌ 2, మెహిడి హసన్ 1 వికెట్ తీశారు. బంగ్లా విజయానికి … Read more