• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

    HYD: నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని నాలుగంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనాస్థలికి 4 ఫైరింజన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్‌ తయారీ కోసం వాడే కెమికల్స్‌ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్లు సమాచారం. యజమాని జైశ్వాల్‌కు ఓ ప్లాస్టిక్‌ తయారీ ఫ్యాక్టరీ ఉన్నట్లు గుర్తించారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Major #FireAccident out break … Read more

    ఆ పార్టీలు మాదిగ విరోధులు: ప్రధాని

    భారాస, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరై మాట్లాడారు. ‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా’ అని అన్నారు.

    Rakul Preet Singh: రెడ్‌ డ్రెస్‌లో ఎర్ర గులాబీలా మెరిసిన రకుల్‌.. ఈ భామ ఒంపుసొంపులకు నెటిజన్లు ఫిదా!

    టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోమారు సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. ఎరుపు రంగు ఔట్‌ఫిట్‌లో గులాబీలా మెరిసిపోయింది.  రెడ్‌ డ్రెస్‌లో రకుల్‌ అందాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతిలోక సుందరి అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.  హీరోయిన్‌గా రకుల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే టాప్‌ చిత్రాలతో ఆకట్టుకుంది.  టాలీవుడ్‌లో రకూల్‌ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌, గోపిచంద్‌, రామ్‌ పోతినేని, సాయిధరమ్‌ తేజ్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది.  ‘గిల్లీ’ … Read more

    బంగ్లాదేశ్‌పై ఆసీస్‌ ఘన విజయం

    ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 306-8 స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ రెండే వికెట్లు కోల్పోయి 44.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్‌ (177*; 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. 87 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అటు స్టీవ్ స్మిత్ (63*), వార్నర్ (53) అర్ధ శతకాలు బాదారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్‌, … Read more

    ENG vs PAK: ఇంగ్లాండ్‌ భారీ స్కోరు

    పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్న పాక్.. ఈ భారీ లక్ష్యాన్ని 6.2 ఓవర్లలో ఛేదిస్తే నాకౌట్‌కు చేరుతుంది. కానీ, ఇది జరగడం అసాధ్యం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్‌ స్టోక్ (84), జో రూట్ (60), బెయిర్‌ స్టో (59), మలన్ (31), బట్లర్ (27), బ్రూక్ (30) రాణించారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్‌ 3, షాహీన్ అఫ్రిది … Read more

    Jigarthanda 2 review: ‘జిగర్‌ తండ 2’ యాక్షన్ సీన్లు ఓకే.. సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు: రాఘవ లారెన్స్ , ఎస్‌జే సూర్య, షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాష్, ఇళవరసు తదితరులు దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిర్రు నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, ఎస్ కతిరేసన్, అలంకార్ పాండియన్ ‘పిజ్జా’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఆ తర్వాత ‘జిగర్‌ తండ’ (తమిళనాడులో లభించే శీతల పానీయం) చిత్రంతో స్టార్‌ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా ‘జిగర్‌ తండ డబుల్‌ … Read more

    దక్షిణాఫ్రికా లక్ష్యం 245 రన్స్‌

    వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గనిస్తాన్‌ జట్టు 244-10 (50) స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 97*( 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో అప్గన్‌ స్కోరు 200 దాటగల్గింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రహ్మాత్ షా 26, హష్మతుల్లా షాహిది 2, ఇక్రామ్‌ అలిఖిల్ 12, మహమ్మద్‌ నబీ 2, రషీద్‌ ఖాన్ 14, నూర్‌ అహ్మద్‌ 26, ముజీబ్‌ 8, నవీన్‌-ఉల్‌-హక్‌ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 2 … Read more

    ‘కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే’

    TG: హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పాలన వస్తే ప్రతి విషయానికి ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఆ రాష్ట్రంలో 5 గం.ల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. హుజూరాబాద్‌లో భాజపా మూడో స్థానానికి పడిపోయింది. అన్ని సర్వేలలో కూడా భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు’ అని అన్నారు.

    న్యూజిలాండ్‌ ఘన విజయం

    వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన డారిల్‌ మిచెల్ (43; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత … Read more

    భాజపా నాలుగో జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. తుది జాబితాను ఖరారు చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి-రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, మేడ్చల్-విక్రమ్ రెడ్డికి కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.