నటీనటులు: రాఘవ లారెన్స్ , ఎస్‌జే సూర్య, షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాష్, ఇళవరసు తదితరులు
దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: తిర్రు
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, ఎస్ కతిరేసన్, అలంకార్ పాండియన్
‘పిజ్జా’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఆ తర్వాత ‘జిగర్ తండ’ (తమిళనాడులో లభించే శీతల పానీయం) చిత్రంతో స్టార్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ను కార్తీక్ సిద్ధం చేశారు. ఇది దీపావళి సందర్భంగా ఇవాళ (నవంబర్ 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సీక్వెల్ కథేంటి? ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా లారెన్స్, దర్శకుడిగా ఎస్.జె.సూర్య చేసిన సందడి ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించింది? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ
రాఘవ లారెన్స్ (అలియాస్ సీజర్) ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. పోలీస్ కావాలనే కలతో మరోవైపు ఎస్‌జే సూర్య (రే దాసన్) కలలు కంటుంటాడు. దురదృష్టవశాత్తు ఓ మర్డర్ కేసులో రే దాసన్ అరెస్ట్ అవుతాడు. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల రాఘవ లారెన్స్‌ను చంపేందుకు ఎస్ జే సూర్య ఒప్పుకుంటాడు. అసలు లారెన్స్‌ను ఎస్‌జే సూర్య ఎందుకు చంపాలనుకుంటాడు. అతని వెనుక ఉన్నది ఎవరు? ఇంతకు ఎస్‌జే సూర్య.. లారెన్స్‌ను చంపుతాడా? అనేది మిగతా కథ
ఎవరెలా చేశారంటే
సీజర్ పాత్రలో రాఘవ లారెన్స్ అద్భుతంగా నటించారు. ఆయన పాత్రలో పలు కోణాలను ఆయన చక్కగా ఆవిష్కరించారు. ఇందులో ఎస్.జె.సూర్యది కూడా భిన్నమైన పాత్రే. ప్రధమార్ధంలో కన్నా ద్వితీయార్ధంలో ఆయన పాత్ర ప్రభావం బలంగా కనిపిస్తుంది. సెటానీ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఆ పాత్రలో చేసిన నటుడు క్రూరమైన నటనతో ఆకట్టుకున్నాడు. క్రూరుడైన పోలీస్‌గా నవీన్ చంద్ర నటన కూడా కట్టిపడేస్తుంది. లారెన్స్ భార్య చేసిన నిమేష కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఈ సినిమా కథ, చిత్రీకరణ, నటీనటుల పాత్రలు బాగున్నప్పటికీ కథనం విషయంలో మాత్రం దర్శకుడు సుబ్బరాజు విఫలమయ్యారు. ఆసక్తికరంగా కథను నడిపించడంలో ఆయన తడబడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైబల్ నేపథ్యం చుట్టూ సాగే ట్రాక్‌లో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల మధ్య వచ్చే సంఘర్షణలు, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫస్టాఫ్‌ను డైరెక్టర్ నడిపించినట్లు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే మెయిన్స్ సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకోవు. యాక్షన్ కోసం పెట్టిన సీక్వెన్సెస్ కూడా స్థాయికి తగ్గట్టు దర్శకుడు చూపలేకపోయాడు. ఇక కార్తీక్ కథల్లో ఉండే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇందులో అంతగా కనిపించవు.
టెక్నికల్‌గా
సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగా ఆకట్టుకుంది. తిర్రు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథా నేపథ్యం..
- లారెన్స్, ఎస్.జె.సూర్య నటన
- ద్వితీయార్ధం
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథనం
- ప్రథమార్ధం
- సినిమా నిడివి
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం