మనం పొడవైన, ఒత్తైన జుట్టు కోసం తెగ తాపత్రయ పడుతుంటాం. కానీ మనం కోరుకున్నట్లు మన జుట్టు ఉండదు. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, పెరగపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం. దీని నుంచి విముక్తి పొందాలంటే సహజసిద్ధమైన షాంపూలనే వాడాలి. ఇలాంటి సహజ ఉత్పత్తులు ఎలాంటి గాఢత లేకుండా సున్నితంగా ఉంటాయి. చర్మానికి హాని కలిగించవు. ఈ న్యాచురల్ షాంపూల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఆ షాంపూలు ఏంటో YouSayలో తెలుసుకుందాం.
ఆయుర్ ఆమ్లా సీకాకాయ్ విత్ రీతా షాంపూ
ఉసిరి, కుంకుడుతో చేసిన ఆయుర్ ఆమ్లా సీకాకాయ్ విత్ రీతా షాంపూపై ప్రజల్లో ఎక్కువగా నమ్మకం ఉంది. సహజ పదార్థాలను ఉపయోగించి దీనిని తయారు చేయడంతో జుట్టు బలంగా పెరుగుతుంది. ఈ బ్రాండ్ చాలా ప్రజాదరణ పొందింది.
కేశ్ కింగ్ అలోవేరా హెర్బల్ షాంపూ
కేశ్ కింగ్ అలోవేరా హెర్బల్ షాంపూ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఈ షాంపూను ఉసిరి, భృంగరాజ్, అమల్కి, మజిష్ట తదితర మూలికలతో తయారు చేస్తారు. దీంతో ఈ షాంపూను ఎక్కువ మంది వాడుతున్నారు.
వాడి హెర్బల్స్ పింక్ లోటస్ షాంపూ
వాడి హెర్బల్స్ పింక్ లోటస్ షాంపూ విత్ హనీ సకిల్ ఎక్ట్స్రాక్ట్ జుట్టు రంగును కాపాడుతుంది. జుట్టు రంగు తెల్లగా మారకుండా నియంత్రిస్తుంది. దీనిని పింక్ లోటస్‌ను ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో ఉండే కొన్ని మూలికలు జుట్టు కలర్ తగ్గకుండా పనిచేస్తాయి.
కేస్ నిఖర్ హెర్బల్ షాంపూ విత్ ఆమ్లా, రీతా, షీకాకాయ్
కేస్ నిఖర్ హెర్బల్ షాంపూను ఉసిరి, షీకాకాయ్, రీతా సహజ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ షాంపూ కురుల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని అందరూ వినియోగించవచ్చు. ఈ షాంపూలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్