• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?

    నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు

    రచన, దర్శకత్వం: అభిమన్యు

    సంగీతం: ప్రశాంత్ విహారి

    సినిమాటోగ్రఫీ: దీపక్‌

    ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషద్‌

    స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా

    విడుదల తేదీ: 16-02-2024

    ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్‌-1లో బయటపడుతుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ ఏంటి? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్‌ ఉమెన్‌ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్‌ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్‌.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు.

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్

    • ప్రియమణి నటన
    • ట్విస్ట్‌లు
    • టెక్నికల్ టీమ్‌ పనితీరు

    మైనస్‌ పాయింట్స్‌

    • కొన్ని సాగదీత సీన్లు
    • ప్రీ క్లైమాక్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv