Bollywood Vs South Industries: బాలీవుడ్‌ – సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bollywood Vs South Industries: బాలీవుడ్‌ – సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?

    Bollywood Vs South Industries: బాలీవుడ్‌ – సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?

    August 21, 2024

    బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియాగా ప్రస్తుత పరిస్థితులు పరిణమిస్తున్నాయి. సౌతిండియా చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుండటాన్ని కొందరు బాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయి అవార్డులు ఎక్కువగా హిందీ చిత్రాలకే వచ్చేవి. కలెక్షన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత నుంచి సౌత్ సినిమాల హవా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద గణనీయంగా పెరిగింది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఒకట్రెండు మినహా సంచలనం సృష్టించిన సినిమాలు రిలీజ్‌ కాలేదు. దీంతో బాలీవుడ్‌ నటుల్లో సౌత్‌ సినిమాలపై అసహనం, అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అర్షిద్ వర్సి హీరో ప్రభాస్‌ పలుష పదజాలాన్ని ఉపయోగించడం వివాదస్పదమైంది. తాజాగా సౌతిండియన్‌ స్టార్‌ బాలీవుడ్‌ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్‌ – సౌత్ ఇండస్ట్రీల మధ్య కోల్డ్ వార్‌ మెుదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

    ‘బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేస్తోంది’

    కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌ శెట్టి బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి బాలీవుడ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కొన్ని భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌ వేస్తారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం, నా రాష్ట్రం, నా భాష వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’ అని రిషబ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో కొందరు నెటిజన్లు రిషబ్‌ను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను షేర్‌ చేస్తున్నారు. 

    ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అక్కసు

    బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ‘ చిత్రం గురించి ప్రస్తావిస్తూ హీరో ప్రభాస్‌పై తనకున్న ఈర్ష్యను వెళ్లగక్కారు. ‘క‌ల్కి’ తాను చూశానని మూవీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అర్షద్‌ చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్‌ పాత్ర తేలిపోయిందన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్‌.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకో ఆయన లుక్‌ జోకర్‌లా ఉంది. మ్యాడ్‌ మ్యాక్స్‌ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్‌ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అని అన్నారు. అర్షద్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    తెలుగు హీరోల స్ట్రాంగ్‌ కౌంటర్‌

    ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్‌ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్‌ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు.  అటు యువ నటుడు ఆది సాయికుమార్‌ సైతం అర్షద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాడు.  అర్షద్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

    బాలీవుడ్‌కు ఏమైంది? : అల్లు అర్జున్‌

    గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంటున్నాయి.  ఈ విషయంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ ఇటీవల స్పందించారు. బాలీవుడ్‌ సినిమాపై అల్లు అర్జున్‌ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. ‘గతంలో అల్లు అర్జున్‌తో నేనొక సినిమా చేయాలనుకున్నా. అందుకోసం ఆయన్ని కలిశా. బాలీవుడ్‌ పరిస్థితిపై ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ‘బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీరెందుకు మర్చిపోయారు?’ అని అడిగారు. ఆయన చెప్పింది నిజమే దక్షిణాది చిత్రాల్లో హీరోయిజం, అందులోని కీలక భావోద్వేగాలను చక్కగా చూపిస్తారు. ఆవిధంగా ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో అలాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి. మంచి విజయాన్ని అందుకున్నాయి. నేడు హిందీ సినిమాల్లో అది లోపించింది’ అని నిఖిల్‌ అన్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version