• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL Playoff Scenarios: ప్లేఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చిన ముంబయి.. మరీ RCB పరిస్థితి ఏంటీ? అలా జరిగితే SRH కప్‌ కొట్టొచ్చు..!

    ఐపీఎల్‌ 2023 సీజన్‌ మరింత రసవత్తరంగా మారింది. ప్రతీ టీమ్‌ 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మినహా ప్రతీ జట్టు తలో 11 మ్యాచ్‌లు ఫినిష్‌ చేశాయి. అయితే గత సీజన్లలో ఇదే సమయానికి ప్లేఆఫ్‌కు చేరబోయే జట్లు దాదాపు ఖరారు అయ్యాయి. కానీ ఈసారి మెుదటి స్థానంలో ఉన్న గుజరాత్‌ మినహా.. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది. దీంతో ఇప్పటి నుంచి జరగబోయే ప్రతీ మ్యాచ్‌ ఆయా జట్లకు ‘డూ ఆర్‌ డై’గా … Read more

    IPL 2023: టీమిండియా ఫ్యూచర్‌ స్టార్స్‌.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న యంగ్‌ క్రికెటర్లు 

    టీమిండియాలో స్థానం కోసం ఐపీఎల్‌ ఒక షార్ట్‌కట్‌ వే అని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లను బీసీసీఐ త్వరగా గుర్తించడంతో పాటు, వారికి జాతీయ జట్టులోనూ అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో తమ ప్రదర్శన ఎలా ఉన్నా ఐపీఎల్‌లో రాణించాలని యంగ్‌ క్రికెటర్లు భావిస్తున్నారు. అందుతగ్గట్లే ఈ సీజన్‌లోనూ పలువురు యంగ్‌ క్రికెటర్లు విశేషంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నారు. బ్యాటు, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తూ భారత ఫ్యూచర్‌ స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇంతకీ ఈ సీజన్‌లో రాణిస్తున్న ఆటగాళ్లు ఎవరు? … Read more

    ముంబై ఘన విజయం

    ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్(83) చెలరేగి ఆడాడు. ఏమాత్రం కనికరం చూపకుండా బెంగళూరు బౌలర్లపై సూర్య ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(42), నేహాల్ వధేరా(52)లు రాణించారు. హసరంగ, వైశాఖ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్య ఛేదనలో … Read more

    Rinku Singh: ధోని లాంటి ఫినిషర్‌ దొరికేశాడు.. రింకూ బ్యాట్‌ పడితే క్రికెట్‌ ప్రియులకు పూనకాలే..!

    దేశంలో ప్రస్తుతం రింకూ సింగ్ మేనియా నడుస్తోంది. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరపున ఆడుతున్న రింకూ.. మ్యాచ్‌ మ్యాచ్‌కు తన క్రేజ్‌ పెంచుకుంటున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రింకూ సింగ్.. తాజాగా అటువంటి ప్రదర్శనతోనే మళ్లీ మెరిశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో మరోసారి తన బ్యాట్‌ను ఝళిపించాడు. స్లో వికెట్ మీద 10 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి … Read more

    IPL Last Ball Six: ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసిన ఆటగాళ్లు వీరే..!

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) సంచనాలకు మారుపేరుగా మారిపోయింది. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లతో క్రికెట్‌ ప్రియులను కావాల్సినంత మజా అందిస్తోంది. 200కు పైగా రన్స్‌ సాధించినా గెలుస్తామన్న నమ్మకం జట్లకు ఉండటం లేదు. అలాగే 130 స్కోరు చేసినా గెలుపుపై ధీమా నిలవడం లేదు. ఎందుకంటే ఆఖరి బాల్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తోంది. చివరి బంతికి సిక్స్‌ కొట్టడం ద్వారా బ్యాటర్లు విజయాన్ని ఎగరేసుకుపోతున్నారు. దీంతో ఫలితాన్ని ముందుగానే అంచనావేయడం కష్టతరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌ సీజన్లలో లాస్ట్‌ బాల్‌ విక్టరీలు … Read more

    మురళీ కార్తీక్ తప్పిదాన్ని సరిచేసిన హార్దిక్‌

    గుజరాత్‌, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో టీవీ ప్రజెంటర్ మురళీ కార్తీక్ చేసిన పెద్ద తప్పిదాన్ని గుర్తించి హార్దిక్ సరిచేశాడు. నిన్నటి మ్యాచ్‌తో పాండ్యా సోదరులు ఇద్దరూ కెప్టెన్లుగా తలపడ్డారు. టాస్‌ సమయంలో హార్దిక్ కాయిన్ విసరగా…కృణాల్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడుతుంది. కానీ, మురళీ కార్తీక్ టెయిల్స్‌ అని తప్పుగా చెప్తాడు. వెంటనే హార్దిక్ పాండ్యా హెడ్స్ అది అంటూ నవ్వుతూ సరిచేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #LSG Skipper Krunal Pandya has won the toss … Read more

    IPL Failure Stars: IPLలో విఫలమవుతున్న మ్యాచ్‌ విన్నింగ్‌ స్టార్స్.. మరీ ఇంత దారుణమా?

    అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రపంచ క్రికెట్‌ లీగుల్లో ఐపీఎల్‌ తొలి స్థానంలో ఉంటుంది. ఈ టోర్నీలో రాణిస్తే తమకు కెరీర్‌కు తిరుగుండదని క్రికెటర్లు భావిస్తారు. అందుకు అనుగుణంగానే అనేక మంది బ్యాటర్లు, బౌలర్లు ఐపీఎల్‌లో రాణించి.. స్టార్లుగా మారారు. తమ జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించి కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. తద్వారా జాతీయ జట్లలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే గత IPL సీజన్లలో ఎంతో నిలకడ రాణించిన కొందరు ప్లేయర్లు ఈసారి మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ … Read more

    ధావన్ చెప్పాడు కాబట్టి బౌలింగ్: రోహిత్

    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. ఏ నిర్ణయం తీసుకోవాలని శిఖర్ ధావన్‌ని అడిగాడు. దీంతో ‘మీరు బౌలింగ్ చేయండి’ అని శిఖర్ రోహిత్‌తో చెప్పాడు. ఇదే విషయాన్ని టాస్ రిప్రసెంటేటివ్ అంజుమ్ చోప్రాతో చెబుతూ తాము బౌలింగ్ చేయదల్చుకున్నట్లు రోహిత్ శర్మ నవ్వుతూ వెల్లడించాడు. టాస్ ఓడిన శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. దీంతో ఈ ఇద్దరి బ్యాటర్ల మధ్య అనుబంధాన్ని హైలైట్ … Read more

    హమ్మయ్యా.. ధోని రిటైర్మెంట్ లేనట్లే!

    సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్ 2023 సీజన్ చివరిదని అందరూ అనుకుంటుటున్నారు. ఈ క్రమంలోనే ధోని ఆటను ఆస్వాదించడానికి అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. అతడు రెండు బంతులాడినా అదే మాకు మహాప్రసాదం అన్నట్లుగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా కామెంటేటర్ డానీ మారిసన్ ‘‘ఇదే నీకు చివరి ఐపీఎల్ అవుతుందా.. అందుకే ఇంతమంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారా’’ అంటూ ధోనిని ప్రశ్నించాడు. ‘‘ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారు.. నేను కాదు.’’ … Read more

    Virat Kohli: వివాదాలకు కేంద్రంగా విరాట్ కోహ్లీ.. గంభీర్‌తో వివాదానికి అసలు కారణం ఇదేనా?

    విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మైదానంలో పరుగులు వరద పారించగల సత్తా ఉన్న ఆటగాడు. రికార్డుల్లో తన పేరు ఉండటం కాదు.. తన పేరు మీదే రికార్డులు ఉంటాయనడానికి నిదర్శనం. మైదానంలో సహజంగానే కోహ్లీ కాస్త హైపరాక్టివ్‌గా ఉంటాడు. దూకుడుగా ఉంటూ జట్టులో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, కొన్నిసార్లు కోహ్లీ లయ తప్పుతున్నాడేమోనని అనిపించక మానదు. అందుకే రికార్డుల మాదిరే.. వివాదాలు కూడా ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ తన ప్రవర్తనతో విరాట్ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు.  గంభీర్‌తో.. టీమిండియా మాజీ … Read more