ఐపీఎల్ 2023 సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ప్రతీ టీమ్ 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మినహా ప్రతీ జట్టు తలో 11 మ్యాచ్‌లు ఫినిష్ చేశాయి. అయితే గత సీజన్లలో ఇదే సమయానికి ప్లేఆఫ్‌కు చేరబోయే జట్లు దాదాపు ఖరారు అయ్యాయి. కానీ ఈసారి మెుదటి స్థానంలో ఉన్న గుజరాత్ మినహా.. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది. దీంతో ఇప్పటి నుంచి జరగబోయే ప్రతీ మ్యాచ్ ఆయా జట్లకు ‘డూ ఆర్ డై’గా మారనుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
1. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన GT 8 విజయాలు, 3 ఓటములతో 16 పాయింట్లు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను దాదాపుగా ఖాయం చేసుకుంది. GT తన తర్వాతి మూడు మ్యాచుల్లో కనీసం ఒకటి గెలిచినా అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి ఎంటర్ అవుతుంది. GT నెక్స్ట్ మూడు మ్యాచ్‌లు ముంబయి, సన్‌రైజర్స్, బెంగళూరుతో ఆడనుంది.
2. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)
గుజరాత్ తర్వాత ప్లేఆఫ్ అవకాశాలు మెండుగా ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన CSK 6 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో 13 పాయింట్లు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై తన తర్వాతి మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలవాలి. అలా చేస్తే 17 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్తుంది. మూడూ గెలిస్తే టాప్ ప్లేస్‌లోనూ నిలిచే ఛాన్స్ ఉంది. చెన్నై తన తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో రెండు ఢిల్లీతోనే ఆడనుంది. KKRతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది.
3. ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)
RCBతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబయి తన ప్లేఆఫ్ అవకాశాలను గణనీయంగా పెంచుకుంది. 11 మ్యాచ్‌లు ఆడిన ముంబయి 12 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది. ముంబయి ఆ పొజిషన్‌ను కాపాడుకోవాలంటే తన తర్వాతి మూడు మ్యాచుల్లో గెలవాల్సి ఉంది. అయితే వీటిలో రెండు మ్యాచ్‌లు హోంగ్రౌండ్‌లోనే జరగనుండటం MIకి కలిసిరానుంది. MI తన తర్వాతి మ్యాచుల్లో గుజరాత్, లక్నో, హైదరాబాద్ జట్లతో తలపడనుంది.
4. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)
లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం RR, KKR, RCB, PBKS జట్ల నుంచి లక్నోకు తీవ్ర పోటీ ఉంది. ఇదే సమయంలో కెప్టెన్ కే.ఎల్. రాహుల్ గాయంతో దూరం కావడం ఆ జట్టుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో LSG ప్లేఆఫ్స్ చేరాలంటే గొప్పగా పుంజుకొవాల్సిన అవసరం ఉంది. మిగిలిన మ్యాచ్‌లో గెలవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను పెంచుకుంటే LSG ప్లేఆఫ్స్‌కు చేరొచ్చు.
5. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)
ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 5 స్థానంలో ఉన్న RR డేంజర్ పొజిషన్‌లో ఉందని చెప్పొచ్చు. బెంగళూరుపై ముంబయి విజయం సాధించడం వల్ల RR ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇక RR ప్లేఆఫ్ చేరాలంటే తప్పనిసరిగా తర్వాతి మూడు మ్యాచుల్లో గెలవాలి. అంతేగాక మిగిలిన జట్టు ఫలితాలు కూడా RRకు అనుకూలంగా ఉండాలి. రాజస్థాన్ తన తర్వాతి మ్యాచుల్లో కోల్‌కత్తా, బెంగళూరు, పంజాబ్‌తో తలపడనుంది.
6. కోల్‌కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)
పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించడం ద్వారా కోల్‌కత్తా నైట్ రైడర్స్ తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐదు విజయాలతో 10 పాయింట్లు మాత్రమే సాధించిన KKR ముందుకు వెళ్లాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి. అయితే ఆ మ్యాచ్‌లన్నీ హోం గ్రౌండ్‌లో జరగనుండటం KKRకు కలిసిరానుంది. ఈ మ్యాచ్‌లలో భారీ వ్యత్యాసంతో ప్రత్యర్థులను ఓడించగల్గితే నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్ చేరే ఛాన్స్ ఉంటుంది. కోల్‌కత్తా తన తర్వాతి మ్యాచుల్లో రాజస్థాన్, చెన్నై, లక్నోలతో తలపడనుంది.
7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)
ముంబయితో ఓటమి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ప్రమాదకర స్థితిలోకి నెట్టింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ కూడా -0.345 ఉండటం ఆ జట్టుకు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో RCB తన తర్వాతి మూడు మ్యాచుల్లో భారీ విక్టరీ నమోదు చేయాలి. అప్పుడు మాత్రమే మైనస్‌లో ఉన్న నెట్ రన్‌రేట్ ప్లస్‌లోకి వచ్చి ప్లేఆఫ్ రేసులో నిలిచే ఛాన్స్ ఉంది. ప్లేఆఫ్ కోసం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీ ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. RCB తన తర్వాతి మ్యాచుల్లో రాజస్థాన్, సన్‌రైజర్స్, గుజరాత్‌తో ఢీకొననుంది.
8. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)
KKRతో జరిగిన కీలకపోరులో ఓడిపోవడం ద్వారా పంజాబ్ కింగ్స్ తన ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 10 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచిన పంజాబ్ ప్లేఆఫ్ చేరడం ఇక కష్టమేనని చెప్పాలి. తర్వాతి మూడు మ్యాచుల్లో గెలిచినా నెట్ రన్‌రేట్ – 0.441 ఉండటం పంజాబ్‌కు అడ్డంకిగా మారనుంది. పంజాబ్ తర్వాతి 3 మ్యాచుల్లో 2 ఢిల్లీతో ఆడనుంది. మరొక దాంట్లో రాజస్థాన్‌తో తలపడుతుంది.
9. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగల్గింది. 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న SRHకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచుల్లో భారీ విజయాలు సాధిస్తే ప్లేఆఫ్ చేరవచ్చు. అయితే SRH తన తర్వాతి మ్యాచుల్లో గుజరాత్, ముంబయి, లక్నో, బెంగళూరు వంటి బలమైన జట్లతో తలపడనుంది. ఈ నేపథ్యంలో SRH ప్లేఆఫ్ అవకాశాలపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప SRH ప్లేఆఫ్‌కు వెళ్లలేదు.
10. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నట్లు ఢిల్లీ పరిస్థితి ఉంది. సీజన్ ఆఖరి దశకు వచ్చాక ఢిల్లీ జట్టు ఫామ్ అందుకొని విజయాల బాట పట్టింది. లాస్ట్ 5 మ్యాచుల్లో 4 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ప్లేఆఫ్ వెళ్లడమంటే అసాధ్యమనే చెప్పొచ్చు. ఒకవేళ మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా ఇతర జట్ల గెలుపొటములపై ఢిల్లీ ఆధారపడాల్సిందే. ఢిల్లీ తన తర్వాతి నాలుగు మ్యాచ్‌లు చెన్నై, పంజాబ్‌లతో ఆడనుంది. ఆ రెండు జట్లతో తలో రెండు మ్యాచ్‌లో ఢిల్లీ తలపడనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!