• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rinku Singh: ధోని లాంటి ఫినిషర్‌ దొరికేశాడు.. రింకూ బ్యాట్‌ పడితే క్రికెట్‌ ప్రియులకు పూనకాలే..!

    దేశంలో ప్రస్తుతం రింకూ సింగ్ మేనియా నడుస్తోంది. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరపున ఆడుతున్న రింకూ.. మ్యాచ్‌ మ్యాచ్‌కు తన క్రేజ్‌ పెంచుకుంటున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రింకూ సింగ్.. తాజాగా అటువంటి ప్రదర్శనతోనే మళ్లీ మెరిశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో మరోసారి తన బ్యాట్‌ను ఝళిపించాడు. స్లో వికెట్ మీద 10 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి KKRను గెలిపించాడు. దీంతో సోషల్ మీడియాలో రింకూ సింగ్‌ మరోమారు సంచలనంగా మారిపోయాడు. వెంటనే అతడిని టీమిండియాకు సెలెక్ట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

    డెత్‌ ఓవర్లలో కింగ్‌

    గత మూడు సీజన్ల నుంచి రింకూ సింగ్‌ KKR జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడ్ని KKR కేవలం రూ. 80 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. గత సీజన్లలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రింకూ పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే ఈ సీజన్‌లో రింకూ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో అతడిపేరు మార్మోగుతోంది. KKR తరపున 11 మ్యాచ్‌లు ఆడిన రింకూ 337 పరుగులతో అందరికంటే ముందున్నాడు. 151.12 స్ట్రైక్‌రేట్‌తో ఈ పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో డెత్‌ ఓవర్లలో(17-20 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ రింకూ సింగ్‌ నిలిచాడు. డెత్‌ ఓవర్లలో రింకూ స్టైర్‌రేట్‌ ఏకంగా 197.53గా ఉందంటే అది బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇక రింకూ హిట్టింగ్‌ను చూసిన క్రికెట్‌ అభిమానులు అతడి ఆటకు రూ.16 కోట్లు చెల్లించినా తక్కువేనని అభిప్రాయపడుతున్నారు. 

    ఎవరీ రింకూ సింగ్‌?

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో అతి సామాన్యమైన కుటంబంలో రింకూ సింగ్‌  జన్మించాడు. రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లను డెలివరి చేస్తూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. రింకూ సోదరుడు ఆటో నడుపుతుంటాడు. ఇక రింకూ తన జీవితంలో ఒకానొక సమయంలో స్వీపర్‌గా కూడా పని చేశాడు. అదే విధంగా అతడి సోదరుడికి ఆటో నడపడంలో కూడా సహాయపడేవాడు. రింకూ చదువు విషయానికి వస్తే అతడు పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతితో తన చదువు మానేశాడు. 2018లో తొలిసారి ఐపీఎల్‌ వేలంగా పాల్గొన్న రింకూను రూ.80 లక్షలు పెట్టి కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. దీనిపై అప్పట్లో జాతీయ మీడియాతో మాట్లాడిన రింకూ.. ‘వేలంలో 20 లక్షలు వస్తాయని అనుకున్నా. కానీ నన్ను 80 లక్షలకు కొనుగోలు చేశారు. నా తమ్ముడు, చెల్లెలి పెళ్లికి ఆ డబ్బులు ఖర్చుపెడతా’ అని పేర్కొన్నాడు.

    డొమెస్టిక్‌ కెరీర్‌

    రింకూ దేశీవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రింకూ  2307 పరుగులు చేశాడు. అదే విధంగా అతడు 41 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఎ కెరీర్‌లో 1414 పరుగులు, టీ20ల్లో 1414 పరుగులు సాధించాడు. ఇక  ఐపీఎల్ కెరీర్‌ విషయానికి 2018 నుంచి ఇప్పటివరకూ మెుత్తం 28 మ్యాచ్‌లు ఆడాడు. 141.35 స్ట్రైక్‌ రేట్‌తో 588 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 337 పరుగులు సాధించడం విశేషం.

    క్రికెట్‌ స్కూల్‌ నిర్మాణం

    క్రికెట్‌ నేర్చుకునేందుకు తాను పడ్డ కష్టాలు అలీఘర్‌లో మరెవరూ పడకూడదని రింకూ సింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత డబ్బుతో అలీఘర్‌ క్రికెట్‌ స్కూల్‌ అండ్‌ అకాడమీని ప్రారంభించాడు. క్రికెట్‌ కోసం ప్రధాన నగరాలకు వెళ్లే పనిలేకుండా దీనిని రింకూ ఏర్పాటు చేశాడని అతని చిన్ననాటి కోచ్‌ తెలిపాడు. 15 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

    ప్రస్తుతం పదుల సంఖ్యలో క్రీడాకారులు ఈ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఓ హాస్టల్‌ను కూడా రింకూ నిర్మిస్తున్నాడు. ఈ నెలాఖరులోగా అది అందుబాటులోకి రానుంది. 

    రింకూ గొప్ప ఫినిషర్‌: రస్సెల్‌

    KKR తరపున చెలరేగి ఆడుతున్న రింకూ సింగ్‌పై ఆ జట్టు టాప్‌ హిట్టర్‌ ఆండ్రూ రస్సెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రింకూ ఆటను చూస్తే ఎంతో గర్వంగా ఉందని కొనియాడాడు. పంజాబ్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో తమ మధ్య జరిగిన సంభాషణను రస్సెల్‌ గుర్తుచేసుకున్నాడు. ‘ఆఖరి ఓవర్ ఐదో బంతికి ముందు రింకూ నా దగ్గరికి వచ్చి, బాల్‌ బ్యాటుకి తగలకపోతే సింగిల్ పరుగెడదామని అన్నాడు. నేను సరేనని చెప్పాను. అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఫినిష్ చేయలేకపోతే అతను ఫినిష్ చేస్తాడని నమ్మాను. ఎందుకంటే అతను ఓ గొప్ప ఫినిషర్’ మ్యాచ్‌ అనంతరం రస్సెల్ పేర్కొన్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv