• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దెయ్యం వదిలిస్తానని చెప్పి.. చివరికీ!

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ తాంత్రికుడి చర్యలకు మహిళ బలైంది. పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనా కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. ఇటీవలే ఆమెకు ఓ తాంత్రికుడు పరిచయమయ్యాడు. ప్రియకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో హోమం నిర్వహించి ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ప్రియా మెడపై కాలు వేసి తొక్కాడు. అనంతరం నీటి పైపుతో దారుణంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణం కోల్పోయింది.

  హృదయాలను కదిలిస్తున్న వీడియో

  యూపీ: ప్రతి రోజూ ఆహారం పెట్టే వ్యక్తి మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. ఆయన దేహం వద్ద రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ వానరానికి అన్నం పెట్టేవారు. రోజులో చాలా సమయం కోతితోనే గడిపే వారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ వీడియోను చేసి నెటిజన్లు చలించిపోతున్నారు. इससे बड़ी निःस्वार्थ प्रेम की … Read more

  కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌

  యూపీ: కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా దొరికింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే ఈ ఘటన జరిగింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చిన సంచిలో శోధించింది. మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. మూతను తెరిచేందుకు కోతి యత్నించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టాడు. At the office of Police … Read more

  ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి

  యూపీ: లక్నోలో ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఓ యువకుడు లాగాడు. సైకిల్‌ అదుపుతప్పడంతో ఆమెను రెండు బైకులు ఢీకొట్టాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో 17 ఏండ్ల నైన్సీ పటేల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. यूपी के अम्बेडकरनगर में शर्मनाक वारदात। स्कूल … Read more

  రైతుపై పగబట్టిన ఎద్దు..! వీడియో వైరల్

  యూపీలోని బలియా జిల్లాలో ఓ ఎద్దు రైతును ముప్పుతిప్పలు పెట్టింది. దాడి చేసేందుకు వచ్చిన ఎద్దు నుంచి తప్పించుకునేందుకు ఆ రైతు 2 గం.లపాటు చెట్టుపైనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రస్డా పోలీస్‌స్టేషను పరిధిలో దారితప్పిన ఓ ఎద్దు ఇటీవల 12 మందిపై దాడి చేసింది. ఈ క్రమంలో ‌అది ఖఖ్ను అనే రైతు వెంటపడింది. దీంతో అతడు భయపడి చెట్టు ఎక్కినా ఎద్దు వదల్లేదు. పగబట్టినదానిలా చెట్టు దగ్గరే తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. बलिया में आवारा … Read more

  లిఫ్ట్‌ ఆగిందని వాచ్‌మెన్‌పై దాడి

  ఉత్తర్‌ప్రదేశ్‌ సికందరాలోని రెయిన్‌బో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌పై ఓ మహిళ దాడి చేసింది. లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిందన్న కోపంతో చీపురుతో కొట్టింది. వయసులో పెద్దాయన అన్న గౌరవం లేకుండా చెడామడా తిట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనిత అనే మహిళ ఈ దాడి చేసినట్లు వాచ్‌మన్‌ జగదీశ్‌ తెలిపాడు. వివరణ ఇస్తున్నా వినకుండా కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Kalesh B/w Watchman and Woman inside Rainbow Apartment in … Read more

  రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

  ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పాఠశాల బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్లో వెళ్తున్న పాఠశాల బస్సు SUV కారును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. If this school bus driver … Read more

  110 కి.మీ వేగంతో రైలు; కింద పడ్డ వ్యక్తి

  యూపీలోని షాజహాన్‌పుర్‌ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్‌ఫాం మీద జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతడికి చిన్నగాయం కూడా కాకపోవడం విశేషం. ఈ ఘటన అనంతరం అతడు లేచి నిలబడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. At Shahjahanpur railway station in Uttar Pradesh, a young … Read more

  పాపులారిటీ కోసమే అతిక్ హత్య

  గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ మర్డర్ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాపులారిటీ కోసమే హత్య చేసినట్లు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. సాధారణ జర్నలిస్టుల్లా ముసుగు వేసుకుని నిందితులు హత్యకు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులు లవ్లేష్, సన్నీ, అరుణ్ మౌర్యలను పోలీసులు అరెస్టు చేశారు. హత్య ఘటనలో అతిక్‌తో పాటు అతడు సోదరుడు కూడా మృతిచెందడం గమనార్హం. #WATCH | Atiq … Read more

  అతిక్ హత్య వెనుక యూపీ ప్రభుత్వం: ఒవైసీ

  [VIDEO:](url) గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ హత్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ హత్యలో యూపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. దర్యాప్తుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దర్యాప్తు కమిటీలో ఒక్కరు కూడా ఉత్తర్ ప్రదేశ్ అధికారి ఉండకూడదని ఒవైసీ షరతు విధించారు. నిన్న రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో అతిక్‌తో … Read more